WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒక భార్యకు..ఇద్దరు..భర్తలు...!

ఇదేదో..తెలుగు మసాలా సినిమా టైటిల్‌ అనుకుంటున్నారా..? లేక తమిళ డబ్బింగ్‌ సినిమా అనుకుంటున్నారా..? కానే కాదు..తెలంగాణ ప్రభుత్వం చేసిన చిత్రం...! అవును..తెలంగాణ ప్రభుత్వం రిలీజ్‌ చేసిన యాడ్స్‌లో వచ్చిన ప్రకటన చూసి...తెలంగాణ సమాజం మొత్తం..ఔరా..ఆమెకు ఇద్దరా....? అంటూ..ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎవరామె..? ఎవరా ఇద్దరు భర్తలు..! చెబుతా...!

  తెలంగాణ ప్రభుత్వం తమ ప్రభుత్వం సాధించిన ఘనతల గురించి ఎడాపెడా పత్రికలకు యాడ్స్‌ కుమ్మేస్తుంది కదా..? ఆ కుమ్ముడులో ఏమి యాడ్స్‌ ఇస్తున్నామో..? ఎవరు..యాడ్స్‌లో ఉన్నారో..తెలియకుండానే...పత్రికల మొదటి పేజీ మొత్తం రోజూ యాడ్స్‌తో నింపేస్తుంది కదా..? అప్పుడెప్పుడో..రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...ఆయనకు ఏవైనా ఇబ్బంది కరమైన వార్తలు వస్తాయనుకున్నప్పుడో..లేక..ప్రతిపక్షాలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగితే..అది పత్రికల్లో మొదటి పేజీలో రాకుండా ఉండేందుకు మొదటి పేజీలో పుల్‌పేజీ యాడ్‌ ఇచ్చేవారు. ఇప్పుడు..ఆయన బాటలోనే..తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు కనుక..ఆయన వార్తలేవీ మొదటి పేజీలో రాకూడదన్న చందంగా తమ ప్రభుత్వ ఘనతలు ఇవ్వంటూ...తెలంగాణ ప్రభుత్వం యాడ్స్‌ రిలీజ్‌ చేసింది. 

  యాడ్స్‌ ఇవ్వడం వరకు బాగానే ఉంది...కానీ..దానిలో ఏముందో..చూసుకోలేదు. ఒక భర్త,భార్య, కొడుకు...ఉన్న 'రైతు భీమా' యాడ్‌..అంత వరకు బాగానే ఉంది. తమ రైతులు చనిపోతే..రైతు భీమా కింది పరిహారం చెల్లిస్తామనేది ఆ ప్రకటన సారాంశం. ఇక రెండోది..'తెలంగాణ కంటి వెలుగులు' మొదటి యాడ్‌లో ఉన్నట్లే..అచ్చం..ఆమే..అదే చీర..అదే బట్టు...అదే కొడుకు...సేమ్‌ టూ సేమ్‌..కానీ...భర్త మాత్రం మారిపోయాడు. ఇక్కడ భర్తగా వేరే వ్యక్తిని ముద్రించారు. యాడ్‌ ఇచ్చే సమయంలో ఇచ్చిన వారు కానీ...ముద్రించిన వారు కానీ..ఎవరూ చూడలేదు. ఫస్ట్‌పేజీలో అన్ని పత్రికల్లో ప్రకటనలు వచ్చేశాయి. దీన్ని చూసిన 'జనం' ఇదెక్కడి చోద్యం..'ఆమెకు ఇద్దరా..? అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఏమి చేస్తాం..అంతా 'దొర'గారి మహిత్యం..! అంతే సరిపెట్టుకోవాలి..!

(610)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ