WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కోహ్లీ' సెంచరీ:ఇంగ్లాండ్‌ ఎదుట భారీ లక్ష్యం...!

రెండో టెస్టులో ఘోరమైన ఆటతీరు విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా...మూడవ టెస్టులో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించిన భారత్‌ జట్టు తరువాత..బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ను చుట్టేసింది. మొదటి ఇన్సింగ్‌లో భారీ ఆధిక్యం సాధించిన భారత్‌ రెండో ఇన్సింగ్‌లో భారీ స్కోరు సాధించి..ఇంగ్లాండ్‌కు 521 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. మొదటి ఇన్సింగ్‌లో 97 పరుగులతో రాణించిన కెప్టెన్‌ కోహ్లీ రెండో ఇన్సింగ్‌లో కూడా రాణించారు. మొదటి ఇన్సింగ్‌లో మిస్‌ అయిన సెంచరీని రెండో ఇన్సింగ్స్‌లో సాధించి..గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌ సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ సరసన చేరాడు. కోహ్లీ, పుజారా, పాండ్యా రాణించడంతో..భారత్‌ రెండో ఇన్సింగ్స్‌లో 352/7 పరుగులకు డిక్లేర్‌ చేసి..ఇంగ్లాండ్‌ ముందు భారీ స్కోరును ఉంచింది. ఇంకా రెండు రోజులపాటు మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తన లక్ష్యమైన 521 పరుగుల్లో వికెట్‌ కోల్పోకుండా 23 పరుగులను సాధించింది. రెండు రోజుల సమయం ఉన్న ఈ మ్యాచ్‌లో ఫలితం ఖచ్చితంగా వస్తుంది. 

  భారత్‌ బౌలింగ్‌ను కాచుకుంటూ..ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేస్తారా..? లేక..భారత్‌ బౌలర్స్‌ దెబ్బకు తొలి ఇన్సింగ్స్‌లో చాపచుట్టేసినట్లు చుట్టేస్తారా..? చూడాలి. ఇప్పటికైతే..ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగానే ఆడుతున్నారు. ఓపెనర్స్‌..కుక్‌,జెన్నింగ్స్‌ ఆచితూచి ఆడుతున్నారు. వారికి అసలైన పరీక్ష రేపు ఎదురుకానుంది. వైవిధ్యమైన భారత్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ...భారీ లక్ష్యాన్ని సాధించడం సవాల్‌తో కూడుకున్న పనే. భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ సాధిస్తే..చరిత్ర సృష్టించినట్లే...! కాగా..భారత్‌కు మ్యాచ్‌పై పట్టుదక్కినా...ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎంత తొందరగా ఇంటికి పంపిస్తారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. బ్రిటన్‌ బ్యాట్స్‌మెన్‌కు క్రీజ్‌లో నిలదొక్కుకునే అవకాశం ఇస్తే..మాత్రం దానికి మూల్యం చెల్లించాల్సిందే. సరైన ప్రదేశంలో బంతులను సంధిస్తూ...బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు సృష్టించవచ్చు. ఆశ్చర్యకరంగా..ఈ రోజు 'పాండ్యా'ను కోహ్లీ బౌలింగ్‌కు దించకపోవడంపై ఆసక్తి నెలకొని ఉంది. ఏది ఏమైనా..ఇంకా రెండు రోజుల పాటు..సమయం ఉన్న ఈ టెస్టులో...ఫలితం రావడం మాత్రం ఖాయం.

(151)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ