WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విజయం ముంగిట భారత్‌...!

మొదటి టెస్టులో...కొద్ది తేడాతో ఓడిపోయిన...భారత్‌..రెండో టెస్టులో ఘోర పరాజయం పాలయినా...కీలకమైన మూడో టెస్టులో పుంజుకుంది. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో..భారత్‌ నాటింగ్‌హామ్‌ టెస్టులో ఘన విజయం దిశగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రహానాల భాగస్వామ్యంతో భారీ స్కోరు సాధించింది. తరువాత...బౌలర్లు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను చుట్టేయడంతో..ఇంగ్లాండ్‌ స్వల్పస్కోరుకే ఆలౌట్‌ అయింది. కీలకమైన మొదటి ఇన్సింగ్స్‌లో ఆధిక్యం సాధించిన భారత్‌ రెండో ఇన్సింగ్‌లో భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ కోహ్లీ సెంచరీ సాధించడంతో..ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. 521 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ 265 పరుగులకు ఆలౌట్‌ అయింది. నాలుగో రోజు బ్యాటింగ్‌ మొదలు పెట్టిన 62 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో...ఇంగ్లాండ్‌ త్వరగానే ఆలౌట్‌ అవుతుందని అందరూ భావించారు. అయితే ఐదవ వికెట్‌కు స్టోక్స్‌, బ్లట్టర్‌లు 169 పరుగులు జోడించి..భారత్‌ను చికాకు పెట్టారు. సెంచరీ సాధించిన బ్లట్టర్‌ 'బ్రుమా' ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ పతనం జోరందుకుంది. తరువాత వెంట వెంటనే ఆధిత్యజట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. బ్రుమా జోరుందుకోవడంతో...ఇంగ్లాండ్‌ 282/8తో నిలిచింది.  

(110)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ