WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

30 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు అడుగుతున్న టిడిపి...!

తెలంగాణలో కాంగ్రెస్‌తో టి.టిడిపి పొత్తు ఖాయమేనట...!

తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. షెడ్యూల్‌ సమయానికి జరగాల్సిన సాధారణ ఎన్నికలు..నాలుగు నెలలు ముందే జరగనున్నాయనే భావనతో రాజకీయపార్టీలు ఎన్నికలకు వేగంగా సిద్ధం అవుతున్నారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల హడావుడిలో ముందుంది. వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి..ఎన్నికల శంఖారావాన్ని మోగిస్తామని చెప్పడంతో..కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి, కమ్యూనిస్టుపార్టీలు..హడావుడిగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. దీనిలో భాగంగా..పొత్తుల చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. గత కొన్నాళ్లుగా...తెలంగాణాలో టిడిపితో పొత్తు పెట్టుకోవడం కోసం టిఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌లు ముమ్మరంగా ప్రయత్నాలు చేశాయి. గత ఎన్నికల్లో టిడిపి,బిజెపిలు కలసిపోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో...రెండు పార్టీలు కలసి 19సీట్లను సాధించాయి. అయితే..తరువాత కాలంలో టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంతో..ఆపార్టీ బలహీనపడింది. అయితే..ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు పార్టీ వీడి వెళ్లిపోయినా..టిడిపి సంస్థాగతంగా బలంగానే ఉందన్న అభిప్రాయం..టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు కోసం టిఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌లు పాకులాడుతున్నాయి.

  ఇటీవల కాలంలో టిఆర్‌ఎస్‌తో టిడిపి పొత్తు కుదర్చడానికి 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, సినీనటులు, ఇతర రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారు ప్రయత్నాలు చేశారు. ఇక ఆ రెండు పార్టీల పొత్తు ఖాయమేనన్న పరిస్థితుల్లో ..పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. టిఆర్‌ఎస్‌ కేంద్రంలోని బిజెపితో సఖ్యతగా ఉండడం...అదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు 'మోడీ'పై యుద్ధాన్ని ప్రకటించడంతో...ఆపార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ టిడిపితో పొత్తు కుదుర్చుకోవడానికి సిధ్దపడుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు చంద్రబాబు మద్దతు ఇస్తోన్న నేపథ్యంలో తెలంగాణలో టిడిపితో వెళితే..తాము సులువుగా విజయం సాధిస్తామనే భావనతో..ఆ పార్టీ టిడిపితో పొత్తుకు సిద్ధమని సంకేతాలు పంపుతోంది. 

  మరో వైపు..టిడిపి అధినేత కూడా నిన్న అమరావతిలో నిర్వహించిన సమావేశంలో పొత్తులపై కొన్ని సంకేతాలను పంపించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని చెప్పకున్నా...అక్కడ పొత్తులు తప్పవని స్పష్టంగా చెప్పారు. టిఆర్‌ఎస్‌తో పొత్తులు కుదిరే పరిస్థితి లేదు కనుక..ఇక కాంగ్రెస్‌తోనే టిడిపి వెళుతుందని ప్రచారసాధనాలు హోరెత్తిస్తున్నాయి. కాగా...టిడిపి కాంగ్రెస్‌ పొత్తు దాదాపు ఖరారైందని, ఏఐసీసీ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' 'టిడిపి' అధినేత 'చంద్రబాబు'లు ఇప్పటికే దీనిపై చర్చించుకు న్నారని...తెలుస్తోంది. పొత్తుతో పోటీ చేయాలని...వారిద్దరూ చర్చించుకున్నా..ఎన్ని సీట్లు అనేదానిపై  చర్చించుకోలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. టిడిపి నాయకుల అభిప్రాయం ప్రకారమైతే...30 అసెంబ్లీ సీట్లు, నాలుగు పార్లమెంట్‌ సీట్లు ఇస్తే..పొత్తు కుదిరే అవకాశం ఉందని..చెబుతున్నారు. 'రాహుల్‌గాంధీ' వద్దకు ఈ ప్రతిపాదన వెళ్లిందని...ఆయన వారు అడిగిన సీట్లు ఇవ్వండి..మనకేమీ నష్టం లేదని..'చంద్రబాబు'ను నమ్మవచ్చని చెప్పారని వారు చెబుతున్నారు. మొత్తం మీద.. టిడిపి..అడిగిన సీట్లకు కాంగ్రెస్‌ ఒకే అంటే..ఇక ఆ  రెండు పార్టీలు కలసినడవడం ఖాయమే...!

(1860)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ