WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నెల్లూరులో 'సోమిరెడ్డి'తోనే అనర్థం...!

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నెలకొన్న అనైక్యత, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలపై సిఎం చంద్రబాబు వారితో చర్చించేందుకు ఉన్నతస్థానంలో ఉన్న ఒక వ్యక్తికి ఈ బాధ్యత అప్పచెప్పారు. ఆ వ్యక్తి...ఈ నాయకులందరితో సమావేశమై జరుగుతున్న లోటుపాట్లను, తతంగాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఆ ఉన్నత వ్యక్తి చర్చించినప్పటికీ...'సోమిరెడ్డి' వల్లే తాను పార్టీని వదలివెళ్లిపోతున్నాను...దయచేసి..నన్ను ఆపవద్దు..అని..మీరంటే..ఎంతో గౌరవం ఉంది...ముప్పయేళ్ల రాజకీయజీవితంలో ఎన్నో పదవులు అలంకరించాను..నేను ఎమ్మెల్యేగా,మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడ ఉన్నాడో....? అయినా...ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి చంద్రబాబు ముఖం చూసి ఊరుకున్నాను. కానీ..తన నియోజకవర్గంలోనే..వేరే వ్యక్తిని మంత్రి ప్రోత్సహిస్తున్నారు..ఈ విషయాలన్నీ 'చంద్రబాబు'కు చెప్పాను..నేరుగా పార్టీ సమావేశాల్లో చెప్పాను..నా రాజకీయ భవిష్యత్‌ను నేనే చూసుకుంటాను..నా ముందు కూర్చోవడానికే భయపడే వ్యక్తుల కింద తాను పనిచేయలేనని..ఆయన చెప్పారట. 

  'ఆనం'కు ఎదురైన సంఘటనలు మరికొద్ది మందికి ఎదరు కావడం, వారు కూడా పార్టీ మారతారని ప్రచారం జరగడంతో..ఆ ఉన్నత స్థానంలో ఉన్నవ్యక్తి వారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆ ఉన్నత వ్యక్తితో..సదరు నాయకులు మాట్లాడుతూ 'జిల్లాలో బలమైన 'రెడ్డి' సామాజికవర్గ నేతలైన 'మేకపాటి, నేదురుమల్లి, ఆనం' వర్గీయులు..అయిష్టంగానే 'జగన్‌' పంచన చేరారు. జిల్లాలో పట్టులేని, వరుసగా ఓడిపోతున్న నేతకే పార్టీ పగ్గాలు ఇచ్చారని..దీంతో తాము 'జగన్‌' పార్టీ వైపు చూడాల్సి వస్తోందని..చెప్పారట. అనేక అవమానాలు ఎదురైనా...పార్టీలో ఉన్నామని, ఈ విషయాలన్నీ 'చంద్రబాబు'దృష్టికి తీసుకెళ్లామని, ఆయన అదుగో..ఇదుగో అంటూ...కాలం గడుపుతున్నారని...ఆ వ్యక్తికి చెప్పారట. ఎందుకు 'సోమిరెడ్డి'పై చంద్రబాబు ఆధారపడుతున్నారు..? ముఖ్యమైన వర్గాలన్నీ అయిష్టంగానే 'జగన్‌' వైపు వెళుతున్నాయి..వారంతా...టిడిపిలో ఉంటే..ఒక్క సీటైనా...'జగన్‌'కు దక్కేదా..? అని ఆ ఉన్నత వ్యక్తి ప్రశ్నించారట. ప్రజల్లో పట్టులేని వ్యక్తులను నియోజకవర్గ ఇన్‌ఛార్జిలుగా నియమించారని, దీని వల్లేపార్టీ బలహీనపడిందని..ఆ ఉన్నత వ్యక్తి గ్రహించారట. మొత్తం మీద..'చంద్రబాబు' ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..కానీ..'సోమిరెడ్డి' వ్యవహారశైలిని సిఎం దృష్టికి తీసుకెళ్లరాని తెలిసింది. త్వరలోనే 'సోమిరెడ్డి' వ్యవహారశైలిపై 'చంద్రబాబు' చర్చిస్తారని అప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని..ఆ ఉన్నత వ్యక్తి వారికి చెప్పారట.

(207)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ