WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'హరీష్‌' లేకపోతే..అనర్థమేనా...!?

తెలంగాణ జలవనరులశాఖ మంత్రి 'తన్నీరు హరీష్‌రావు'... మామ కె.చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వెంటనే ఉంటున్నారు. ఆయన వ్యక్తిగత పనులు, పార్టీ పనులు, అధికారపనులను చేస్తూ...చేదోడు..వాదోడుగా ఉన్నారు. 'మేనమామ' టిడిపిలో ఉన్నప్పుడు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తూ పనోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మామ టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌ పార్టీ పెడితే..అన్నీ తానై వ్యవహరించి...పేరు తెచ్చుకున్నారు. 'మామ' నోటి నుంచి మాట వచ్చిందే తడవు..క్షణాల్లో పనులు పూర్తిచేసి 'శభాష్‌' అనిపించుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, ఎన్నికలు, ఉప ఎన్నికలు, సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు...ఏవైనా...ఆయన ఆధ్వర్యంలోనే జరగాలి. 'మామ'కు కూడా ఆయనంటే అంత గురి. అన్ని పనులు...ఆయనకే అప్పగిస్తారు. అప్పచెప్పిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసి 'ట్రబుల్‌షూటర్‌'గా పేరు తెచ్చుకున్నారు. కానీ..నిన్న జరిగిన 'కొంగరకలాన్‌' సభకు ఆయనను తొలిసారి దూరంగా ఉంచారు. ఆయన ఊసే లేకుండా...సభను నిర్వహించారు. 25లక్షల మందిని పోగేస్తున్నాం..సభ చరిత్రలో నిలిచిపోతుంది..అంటూ ఒకటే ఊదరగొట్టారు. కానీ..ఏమి జరిగింది...కనీసం నాలుగు లక్షల మందిని పోగేసుకోలేకపోయారు. సభ అట్టర్‌ప్లాప్‌ అయిందన్న సంగతిని అందరూ అంగీకరిస్తున్నారు. 'ఆయన' లేకపోతే...ఇలాగే అవుతుంది...? చేసుకున్నవారికి చేసుకున్నంత...? అంటూ ఇప్పుడు పార్టీలోనే కొందరు ధీర్ఘాలు తీస్తున్నారు.

 'టిఆర్‌ఎస్‌' కొంగరకలాన్‌' సభ పెడుతున్నామని చెప్పిన దగ్గర నుంచి..ఒక వ్యూహం ప్రకారం, భవిష్యత్‌ రాజకీయ వారసుడి కోసం...'హరీష్‌'ను దూరం పెట్టారు. ఇంతకు ముందు పార్టీ తరుపున ఏ సభ పెట్టినా..ముందుగా 'కెసిఆర్‌' చర్చించేది.. 'హరీష్‌రావు'తోనే...కానీ..కొంగరకలాన్‌ సభ అనుకున్నప్పటి నుంచి..ఆయనను పిలవలేదు..కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా...ఈ సభకు దూరంగా ఉండాలని..అనధికారికంగా...'హరీష్‌'కు చెప్పించారట. కెసిఆర్‌ తన రాజకీయ వారసుడు అయిన 'కెటిఆర్‌'ను ప్రోత్సహించేందుకే...వారసత్వ గొడవలు రాకుండా స్పష్టత ఇచ్చేందుకే సభను నిర్వహిస్తున్నారని ముందు నుంచి తెలుసుకున్న 'హరీష్‌' సభకు దూరంగా ఉండిపోయారు. 'హరీష్‌' ఆధ్వర్యంలో జరగని సభ ఎలా ఉంటుందో..తొలిసారి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు చూస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ సభ అంటేనే 'హరీష్‌రావు'..ఆయన వ్యూచాతుర్యం, శైలి, కార్యకర్తలను కలుపుకుపోయే విధానం..అన్నీతానై...రాత్రింభవళ్లు పనిచేసే విధానంతోనే..ఇంతకు ముందు టిఆర్‌ఎస్‌ సభలు విజయవంతం అయ్యేవి. కానీ...ఈసారి ఆయనను దూరం ఉంచితే ఏమి జరిగిందో..అందరం చూశాం. 'హరీష్‌'ను వదులుకుంటే... ఏమవుతుందో..ఇప్పుడు స్పష్టమైంది. మరి..కొడుకు కోసం..పార్టీని అన్ని వేళలా..కంటికి రెప్పలా కాపాడుకున్న 'హరీష్‌'ను కెటిఆర్‌ వదులుకుంటారా..? ఏమో..కొడుకు కోసం 'కెసిఆర్‌' ఏమైనా చేస్తారేమో..? మొత్తం మీద..'హరీష్‌'ను వదులుకుంటే... అనర్థమేనన్న సంగతి తొలిసారి..టిఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు స్పష్టంగా తెలుసుకున్నారు.

(395)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ