లేటెస్ట్

అనుమతి ఇస్తే 'చంద్రబాబు'ను అరెస్టు చేయిస్తా..!

సిఎం 'జగన్‌' ఢిల్లీ పర్యటన వెనుక ఊహాగానాలు...!

హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఎందుకు వెళ్లారు...? ఎవరూ ఊహించని విధంగా ఆయన గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎందుకు భేటీ అవుతున్నారు..? తరువాత ప్రధాని నరేంద్రమోడీతో రాత్రే భేటీ కావాలని ఎందుకు నిర్ణయించారు..? అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది..? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెనుక ఏం జరుగుతోంది..? ఎందుకు 'జగన్‌' పర్యటనపై ఇంత హడావుడి అటు ఢిల్లీలోనూ...ఇటు రాష్ట్రంలోనూ జరుగుతోందన్నదానిపై రకరకాలైన వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తున్నారనే  దానికి సంబంధించి ఢిల్లీ మీడియా వర్గాలకు కూడా సమాచారం లేదట. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్‌ జర్నలిస్టు ఈ విషయాన్ని ఢిల్లీ మీడియా వర్గాలకు చెప్పేవరకు వారికీ విషయం తెలియదంటే 'జగన్‌' పర్యటన ఎంత గుట్టుగా జరుగుతుందో..? అర్థం అవుతోంది. ఇంత రహస్యంగా 'జగన్‌' ఎందుకు ప్రధాని, హోంమంత్రిని కలుస్తున్నారనే దానిపై ఆసక్తికరమైన కథనాలు బయటకు వస్తున్నాయి. 

'చంద్రబాబు' అరెస్టు...!

ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటన వెనుక సంచలన విషయం బయటకు వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అవినీతి కేసుల్లో అరెస్టు చేసేందుకే ఆయన ఈ పర్యటన పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్నిముందుగా ప్రధాని, హోంమంత్రికి చెప్పిన తరువాత..ముందుకుపోయేందుకు ఆయన నిర్ణయించుకున్నారని, అందుకే వారిని అర్థరాత్రి కలుస్తున్నారనే మాట అత్యంత విశ్వననీయ వర్గాలు వెల్లడించాయి. 'జగన్‌' అధికారంలోకి వచ్చిన తరువాత 'చంద్రబాబునాయుడు' భారీగా అవినీతికి పాల్పడ్డారని, రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేటింగ్‌ జరిగిందని, పీపీఏల ఒప్పందంలో అవినీతి జరిగిందని 'జగన్‌' ఆరోపిస్తున్నారు. 'చంద్రబాబు' అవినీతిని తోడేందుకు ఆయన, ఆయన మంత్రులు గత ఆరు నెలలుగా తీవ్రమైన కృషి చేస్తున్నారు. వారికి  'చంద్రబాబు' అవినీతికి సంబంధించి బలమైన ఆధారాలు లభించాయని, దీని ఆధారంగా 'చంద్రబాబు'ను ఆయన కుమారుడు లోకేష్‌ను అరెస్టు చేయడం కోసం, ఈ విషయాన్ని హోంమంత్రికి తెలిపేందుకే 'జగన్‌' ఢిల్లీకి వెళ్లారని ఆ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అవినీతి కేసులో 'చంద్రబాబు'ను అరెస్టు చేయకపోయినా, ఆయన కుమారుడు 'లోకేష్‌'నైనా అరెస్టు చేయాలనే తలంపుతోనే 'జగన్‌' ఢిల్లీకి వెళ్లారంటున్నారు. 

కాగా...ఈ వాదనను టిడిపి వర్గాలు కొట్టేస్తున్నాయి. తన కేసుల గురించి మాట్లాడుకునేందుకే 'జగన్‌' ఢిల్లీకి వెళ్లారని చెబుతున్నాయి. అక్రమాస్తుల కేసులో కోర్టుకు స్వయంగా హాజరు కావాలని సీబీఐ కోర్టు చెప్పినా...దాన్ని పెడచెవిన పెట్టి 'జగన్‌' ఏదో కారణంతో డుమ్మా కొడుతున్నారని, రేపు శుక్రవారం కూడా ఆయన కోర్టుకు వెళ్లరని, ప్రతిసారీ కోర్టు నుంచి తప్పించుకునేందుకు ఇబ్బంది అవుతుంది కనుక..దీనిపై కేంద్ర హోంమంత్రితో మాట్లాడుకునేందుకే వెళ్లారని ఆ వర్గాలు అంటున్నాయి. మరో వైపు ఇటీవల కాలంలో 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' 'జగన్‌'పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తనకు బిజెపికి మధ్య ఇంకా స్నేహం కొనసాగుతుందని, తాను తలచుకుంటే బిజెపితో వెళతానని 'పవన్‌' చెబుతూండడం, తనపై పదే పదే విమర్శలు చేస్తూండడంతో అసలు ఢిల్లీలో 'పవన్‌'కు ఉన్న భరోసా ఎవరో తెలుసుకునేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారంటున్నారు. కాగా..అధికార పార్టీ మాత్రం 'జగన్‌' అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను ప్రధానితో సమావేశం అవుతానని ఢిల్లీకి వెళ్లడం, ఆయనకు అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతో...తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దరిమిలా..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి కూడా 'ప్రధాని మోడీ' అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని, రేపు ఉదయం సిఎం జగన్మోహన్‌రెడ్డి తిరిగి అమరావతికి చేరుకుంటారని మీడియా వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తం మీద...ప్రతిపక్షనేత అరెస్టు విషయం, స్వ విషయాలు, పవన్‌ సంగతిని తెలుసుకునేందుకు 'జగన్‌' హడావుడి ఢిల్లీ పర్యటన ఆ వర్గాలు అంటున్నాయి. చూద్దాం..ఏమి జరుగుతుందో..?  

(1407)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ