WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మళ్లీ వెలుగులోకి...ఓటుకు నోటు కేసు...!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమైన నేపథ్యంలో వివిధ రాజకీయపార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగానే...తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్‌రావు తన అస్త్రాలను పదును పెడుతున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలకు వ్యూహాలను రచిస్తూ..పార్టీని ఎన్నికల వైపుగా నడిపిస్తున్నారు. అయితే...ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..కొన్ని రాజకీయ ఎత్తుగడలను కూడా ఆయన వేస్తున్నారు. కొన్ని రాజకీయపార్టీలను తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి..పాత కేసులను తవ్వి తీస్తున్నారు. తెలంగాణలో తాను ఎంత అణిచివేసినా..మళ్లీ పుట్టుకొస్తున్న తెలుగుదేశం పార్టీ వల్ల తనకు ఇబ్బంది అవుతుందని భావిస్తోన్న ఆయన టిడిపి అధినేత చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసును మళ్లీ బయటకు తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు..ఈ కేసు విషయం గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో..టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో తిష్టవేస్తే..తనకు తిప్పలు తప్పవని..ఆయన భావిస్తున్నారట. 

  ఇంతకు ముందు హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేయకుండా..వదిలేసినట్లు..ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని..కెసిఆర్‌ ఆకాంక్షిస్తున్నారట. అయితే...ఈసారి 'చంద్రబాబు' మాత్రం ఆ ఆలోచనలో లేరు. ఎట్టి పరిస్థితుల్లోనైనా..తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలని, దానిలో భాగంగా ఇక్కడ కొన్ని రోజులు కేటాయిస్తారని తెలుస్తోంది. పార్టీ గెలిచే సీట్లలో ఆయన రోజుల తరబడి ప్రచారం చేయబోతున్నారు. తెలంగాణలో తాను చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావించబోతున్నారు. తన హయాంలో హైదరాబాద్‌ ఎలా అభివృద్ధి చెందిందో..చెప్పబోతున్నారు. నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేయబోతున్నారు. మధ్యతరగతి, ఎగువమధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు, బీసీ వర్గాలకు చెందిన వారు..చంద్రబాబు పట్ల ఆకర్షితులౌతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో..ఇక్కడ టిడిపి ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. దీన్ని అఢ్డుకోవడానికి..'చంద్రబాబు'ను కట్టడి చేయడానికి..ఓటుకు నోటు కేసును కెసిఆర్‌ బయటకు తీస్తారని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారట. దీనిపై ఇప్పటికే ఒక వ్యూహాన్ని కెసిఆర్‌ సిద్దం చేశారని ప్రచారం జరుగుతోంది. 'ఆయన' కనుక మళ్లీ హైదరాబాద్‌కు వస్తే...ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు..మా దెబ్బేంటో చూపిస్తామని చెబుతున్నారట. మరి..వారి మాటలకు 'చంద్రబాబు' భయపడతారా..?

(355)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ