WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మహాకూటమి'తో కెసిఆర్‌కు ముప్పువాటిల్లనుందా...!?

2009కి ముందు బిజెపి మినహా తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌,సిపిఎం,సిపిఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపి,సిపిఎం,సిపీఐలు కలసిపోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యాన్ని చిరంజీవి స్థాపించడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోయి..కాంగ్రెస్‌ చావుతప్పి కన్నులట్టపోయినట్లు గెలిచింది. కుల,మత ప్రాంతాలుగా ఓటర్లలో చీలిక రావడంతో దివంగత వై.ఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ స్వల్ప మెజార్టీతో లవిజయం సాధించగలిగింది. అప్పట్లో ప్రజారాజ్యం బరిలో లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని..అప్పటి ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్పారు. సిపిఎం నేత 'తమ్మినేని వీరభద్రం' ఈ మహాకూటమి విషయంపై మాట్లాడుతూ తాము ఆ కూటమిలో చేరమని, మరో విధంగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. కానీ కెసిఆర్‌ భవిష్యత్‌లో బిజెపితో పొత్తు కుదుర్చుకుంటారని కేంద్ర వామపక్షాల నాయకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో...మహాకూటమితోనే కలసిపోటీ చేస్తేనే కెసిఆర్‌ను కట్టడి చేయగలమని వారికి తెలుసు. ఏయే పార్టీలతో పోటీ చేయాలనే విషయంపై వామపక్షాల పోలిట్‌బ్యూరో నిర్ణయిస్తుంది తప్ప..రాష్ట్ర నాయకులు కాదు. 'జనసేన'ను కూడా మహాకూటమిలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా...బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్న 'పవన్‌'ను ముందుకు రావడం లేదు. 'పవన్‌' ప్రభావం కన్నా..సిపిఐ,సిపిఎంల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ తెలంగాణలో 25శాతం ఓటర్లు మద్దతు తెలుపుతున్నట్లు టిఆర్‌ఎస్‌ నాయకులే చెబుతున్నారు. నిన్నా మొన్నటి వరకు కెసిఆర్‌ వైపే మొగ్గుచూపుతున్న ఎంఐఎం ఓటర్లు..తాజాగా జరుగుతున్న పరిణామాలతో వారు కెసిఆర్‌ మోడీతో వెళతారనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ ఎంఐఎం నాయకులు టిఆర్‌ఎస్‌కు బాహాటంగా మద్దతు తెలిపినా..ఓటర్లు మనోగతం మరో విధంగా ఉంటుందని గతంలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. 

  ఇప్పటికే తెలంగాణ జిల్లాలో 'కెసిఆర్‌' మోడీతో కుమ్ముక్కు అయ్యారనే విషయాన్ని తెలియచెప్పడంతో సఫలీకృతులయ్యారు. సిపిఎంను కూడా ఏదో విధంగా మహాకూటమిలోకి లాగాలని సిపిఐ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వామపక్షాలతో పోత్తు ఉన్నా లేకున్నా..జనసేన కలసి వచ్చినా..లేకున్నా..టిడిపితో పొత్తు లేక అవగాహన ఉన్నా..తమ విజయం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజికవర్గానికి చెందిన నేతలు..బిసి వర్గాలు..తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మహాకూటమికి సంపూర్ణంగా మద్దతు తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విధంగా, హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు మరో విధంగా జరిగాయి తప్ప..ఆయా ఎన్నికల్లో ప్రస్తుతం పోల్చుకోవడం తప్పని..ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా లేకున్నా..ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే..టిఆర్‌ఎస్‌ను ఓడిస్తామని కాంగ్రెస్‌ నాయకులు నమ్ముతున్నారు. తెలంగాణలో టిడిపి బలం సిపిఐ నాయకులకు తెలుసు. సిపిఎం నాయకులకు తెలిసినా తెలియనట్లు నటిస్తుంటారు. వారికి చంద్రబాబుపై అపార కోపం ఉండడమే కారణం. ఏది ఏమైనా ముందుస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్న కెసిఆర్‌ అధికారాన్ని వదులుకోబోతున్నారని రాజకీయపరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల గంట మోగితే ఏయే సామాజికవర్గాల ఓటర్ల ప్రభావం ఎలా ఉంటుందో..బయటకు రానుంది. కెసిఆర్‌ అసెంబ్లీని రద్దు చేయడం వెనుక 'మోడీ' అనుమతి ఉందని..కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేయబోతున్నారు. వారు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. మెజార్టీ నేతలు..ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఎవరి అదృష్టం ఎలా ఉందో డిసెంబర్‌ మాసాంతానికి బయటపడదు.

(198)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ