WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

105 మందితో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలనం సృష్టిస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ రద్దు తీర్మానం చేస్తూనే మరో వైపు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 105 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప మిగతా అందరికీ సీట్లు ఇస్తున్నట్లు కెసిఆర్‌ ప్రకటించారు. అందోల్‌ ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు టిక్కెట్‌ ఇవ్వడం లేదని కెసిఆర్‌ ప్రకటించారు. ఆయనకు మరో విధంగా అవకాశం కల్పిస్తామని కెసిఆర్‌ తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యేకు కూడా టిక్కెట్‌ ఇవ్వడం లేదని ప్రకటించారు. మరో ఐదు స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై చర్చలు జరుగుతున్నాయని.. వాటిపై పార్టీలో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని చెప్పారు.




(156)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ