WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అంత వృద్ధి ఉంటే...రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో...?

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ...టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆపద్దర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ..నాలుగేళ్ల తన పాలనలో రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని..తెలంగాణ సాధించిన ప్రగతి మరే రాష్ట్రం సాధించలేదని గొప్పగా చెప్పుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఈర్ష్య చెందుతున్నాయని..తెలంగాణ స్థాయిలో ఏ రాష్ట్రం అభివృద్ధి చేయలేదని..దీనంతటికి తాను చేపట్టిన కార్యక్రమాలే కారణమని అన్నారు. తెలంగాణ 21.96శాతం వృద్దితో అభివృద్ధి చెందుతుందని..దేశంలో మరే రాష్ట్రం ఇంత స్థాయిలో అభివృద్ధి చెందలేదని..కనీసం తెలంగాణ దరిదాపులకు కూడా..రాలేదని చెప్పుకున్నారు. మరి ఇంత అభివృద్ధి జరిగితే...తెలంగాణ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..? భవనగిరిలో ముక్కుపచ్చలారని బాలికలు వేశ్యా గృహాలకు ఎందుకు బలి అవుతున్నారు..? ఉద్యోగాలు లేక..నిరుద్యోగులు ఆత్మహత్యల బాట ఎందుకు పడుతున్నారు. వృద్ధి శాతం నిజమైతే...ఇవన్నీ ఆగిపోవాలి కదా..? ఎవరూ చేపట్టని రీతిలో..సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి..తెలంగాణాను హరితహారం చేశామన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు..రైతుల ఆత్మహత్యలపై కనీసం ఎందుకు స్పందించలేదు.ఇంత వృద్ధి ఉంటే...రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 'తెలంగాణ' రెండో స్థానంలో ఎందుకు నిలిచింది. రైతు కుటుంబాల సంవత్సరాదాయం..ఎంత పెరిగిందో..చెప్పగలరా..? ఇప్పటికీ..ప్రతి రైతు రోజువారీ సంపాదన రూ.60/-లే అన్న సంగతి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలుసో లేదో...? పనికి మాలిన అంకెలు చెబుతూ..గారడి మాటలతో కాలం గడిపిన కెసిఆర్‌ మరోసారి..మాయ మాటలతో ప్రజలను వంచించాలని చూస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.  

(150)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ