WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'తో 'చర్చల'కు 'రాహుల్‌' దూత...!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడుతో తెలంగాణలో పొత్తుల గురించి చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' దూతను పంపుతున్నారని ప్రచారం జరుగుతోంది. రేపు 'రాహుల్‌' దూతగా...తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు 'ఉత్తమ్‌కుమార్‌రెడ్డి' 'చంద్రబాబునాయుడు'ను కలసి ఎన్నికల పొత్తులపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ రోజు అమరావతి నుంచి 'చంద్రబాబు' హైదరాబాద్‌ వెళ్లనున్నారు. రేపు ఆయన తెలంగాణ టిడిపి నాయకులతో సమావేశమై రాష్ట్రంలో జరగనున్న ముందస్తు ఎన్నికలపై చర్చించనున్నారు. తమతో కలసి వచ్చే పార్టీలు ఏమిటి..? ఎవరితో పొత్తుతో వెళ్లాలి...కాంగ్రెస్‌ తమతో కలసి వస్తే..ఏ విధంగా ఆ పార్టీతో వ్యవహరించాలి..అనే దానిపై చర్చించనున్నారు. అదే విధంగా టిఆర్‌ఎస్‌,బిజెపిలకు వ్యతిరేకంగా ఏయే పార్టీలు ఉన్నాయి..వీటన్నింటిని కలిపి 'మహాకూటమి'గా చేసి..టిఆర్‌ఎస్‌పై పోటీ చేసే అంశం కూడా చర్చకు రానుంది. అయితే..ఈ చర్చలు ఎలా ఉన్నా..ముందుగా 'కాంగ్రెస్‌' జాతీయ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' 'చంద్రబాబు'తో చర్చలు జరిపేందుకు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పంపుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే తెలంగాణలో వివిధ పార్టీల స్థితిపై తాను సర్వే చేయించానని...తెలంగాణలో టిడిపితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే...సులువుగా విజయం సాధిస్తామని...'రాహుల్‌' కాంగ్రెస్‌ నేతలకు తెలిపినట్లు కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 'చంద్రబాబు'తో సామరస్యపూర్వకంగా, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని కూడా ఆయన ఆదేశించారట. తెలంగాణలో తెలుగుదేశం బలంగానే ఉందని..వారితో పొత్తుపెట్టుకుంటే...లాభం ఉంటుందని కూడా 'రాహుల్‌' చెప్పారని..దీనిలో భాగంగానే 'ఉత్తమ్‌కుమార్‌రెడ్డి'ని 'చంద్రబాబు' వద్దకు పంపుతున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఇక్కడ టిడిపితో పొత్తు కుదుర్చుకుంటే...జాతీయ స్థాయిలో దాని ప్రభావం కాంగ్రెస్‌పై పడుతుందని...తెలంగాణలో కాంగ్రెస్‌,టిడిపి కలసి గెలిస్తే..ఆ ప్రభావం వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలపై ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ టిడిపితోనే వెళ్లాలని 'రాహుల్‌' పట్టుదలతో ఉన్నట్లు ఆవర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద..తెలంగాణలో కాంగ్రెస్‌,టిడిపి పొత్తు పెట్టుకుంటే...అధికార టిఆర్‌ఎస్‌కు ఇక్కట్లు తప్పవని..రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

(1315)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ