WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పీతాని' నాలుగోసారి గెలుస్తారా...!?

కార్మికశాఖా మంత్రిగా బాధ్యతలునిర్వహిస్తున్న 'పీతాని సత్యనారాయణ' 2004,2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 2014లో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించి హ్యాట్రిక్‌ వీరునిగా పేరు తెచ్చుకుని..నాలుగోసారి విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో టిడిపి నేతలను, కార్యకర్తలను అనేక ఇబ్బందులు పాలు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టించిన 'పీతాని సత్యనారాయణ'కు టిడిపి టిక్కెట్‌ ఇవ్వడం ఏమిటి..? విజయం సాధించిన తరువాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఏమిటి..? అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విమర్శలు చేసి బాహాటంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు సామాజికవర్గానికి మంత్రి పీతాని తీవ్ర వ్యతిరేకి అని..ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను, కార్యకర్తలను పలు ఇబ్బందులు పెట్టారని చింతమనేని అనుచరులు పలు సందర్బాల్లో బాహాటంగా విమర్శలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన 'చింతమనేని' సామాజికవర్గానికి చెందిన నాయకుడు ఖండిస్తూ..పార్టీ పరంగా వేధింపులకు, సాధింపులకు మంత్రి పాల్పడినారో లేదో కానీ..కులపరమైన వేధింపులకు ఆయన పాల్పడలేదన్నారు. ఆ విధంగా మంత్రి పాల్పడి ఉంటే..చంద్రబాబు పార్టీలో చేర్చుకుని పోటీ చేసే అవకాశం ఎందుకు ఇస్తారు..? వ్యక్తిగత శత్రుత్వంతో పాటు..ఇతర రాజకీయ కారణాలతో మంత్రి పీతానిపై తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేశారు.

 కాంగ్రెస్‌ హయాంలో ఆయన మంత్రిగా ఎలా ఉన్నారో లేదో పక్కన పెడితే..టిడిపి ప్రభుత్వంలో మంత్రి అయిన తరువాత సామాన్య కార్యకర్తలనుస్వయంగా కలుస్తూ..అన్ని వర్గాల వారితో కలసిమెలసి పనిచేస్తున్నారని ఈ అభిమానంతో ఆయన నాలుగోసారి విజయంసాధించి చరిత్ర సృష్టిస్తారని కొంత మందిపార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీలోకి ఎప్పుడు వచ్చారో కాదు..వచ్చిన తరువాత పరిస్థితి ఏమిటినేది సీనియర్లు తెలుసుకోవాలని, విమర్శలు, ఆరోపణలు చేయకూడదని వారు చెబుతున్నారు. మంత్రి పీతాని నిజాయితీపరుడు, అవినీతిపరుడా అనే విషయంపై గతంలో విమర్శలు చేశారు..తాజాగా ఆరోపణలువస్తున్నాయి. వీటిని ఎవరైనా రుజువు చేయగలుగుతారా..? అని మంత్రి అనుచరులు సవాల్‌ చేస్తున్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం కానీ..ఇటు సీనియర్‌ టిడిపి నాయకులు కానీ...అనేక సందర్బాల్లో..మంత్రి పీతాని పనితీరును తప్పుపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని..అందరికీ సర్దిచెప్పారు. పీతానికి మంత్రి పదవిని ఎలా ఇచ్చారు..అని ముఖ్యమంత్రిని కొందరు ఎమ్మెల్యేలు నిలదీయగా..ఇష్టం ఉన్నా..లేకున్నా..కులాల్లో సమ తూకం పాటించాలి..ఆ నేపథ్యంలోనే 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అధికార యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని మంత్రి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో..జిల్లా యంత్రాంగంపై ఆఫ్‌ ది రికార్డుగా విమర్శలు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

  కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లా యంత్రాంగంమొత్తం మంత్రి అధీనంలోనే ఉంటుంది. కలెక్టర్లు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా నడుస్తున్నారు. ఆ విధంగా సన్నిహితంగా ఉండేవారిపై మంత్రులుపెత్తనం చేయలేరు కదా..? ఏది ఏమైనా 'పీతాని' వ్యవహారంలో అటు విమర్శలు, ఇటు ఆరోపణలు, ఇతర విషయాలు సమతూకంలో ఉన్నాయనేది యధార్థం. పీతాని వ్యవహారశైలిపై అనేక సందర్బాల్లో దెందులూరు ఎమ్మెల్యే విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినా..ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఉభయగోదావరి జిల్లాలో 'శెట్టిబలిజ'లు అధిక నేపధ్యంలో ఆ సామాజికవర్గానికి చెందిన 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీకు ఇష్టం ఉన్నా..నన్ను చూసి సర్దుకుపోండి..భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉంటాయో..అప్పటి వరకు ఎదురు చూడండి..బాహాట విమర్శలు చేయవద్దు..ఏదైనా విషయాలు ఉంటే తన వద్దకు తీసుకు రావాలని..చెప్పడంతో బాహాట విమర్శలు, ఆరోపణలు చాలా వరకు తగ్గాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లు అధికారం చెలాయించి...టిడిపి నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన 'పీతాని'కి మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించి మంత్రి పదవి ఇచ్చారంటే ఆయన ఎంత అదృష్టవంతుడో..స్పష్టం అవుతుంది. కాంగ్రెస్‌ హయాంలో ఇటువంటి సంఘటనలు తక్కువగా ఉన్నా..ముఖ్యంగా చంద్రబాబు హయాంలో ఈ విధంగా కొందరు మంత్రులయ్యారు. వారిలో కొందరు తెరమరుగయ్యారు. భవిష్యత్‌ ఎన్నికల్లో మంత్రి పీతాని మళ్లీ విజయంసాధిస్తే..రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. లేకుంటే....అంతే..!?

(157)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ