WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిధులు అడగడం వెనుక 'మంత్రి అయ్యన్న' ఉద్దేశ్యాలే వేరట...!?

రోడ్లు,భవనాలశాఖకు నిధుల కేటాయింపులో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యతిరేకంగా వ్యవవహరిస్తున్నారని మంత్రి అయన్నపాత్రుడు చేసిన విమర్శల వెనుక వేరే కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మంత్రి అయ్యన్న చేసిన విమర్శలు, ఆరోపణలపై కొంత మంది ఇంజనీరు స్పందిస్తూ.. అయ్యన్న తొందరపడ్డారని అంటున్నారు. వారి చెప్పిన వివరాలు ఏమిటంటే...రోడ్లు,భవనాలశాఖకు గతంలో వెయ్యి కోట్లు నిధులు ముఖ్యమంత్రి కేటాయించేవారు. సుమారు రూ.2500కోట్లుకు పరిపాలనాపరమైన అనుమతులు ముందుగానే ఇచ్చేవారు. దీంతో వెయ్యి కోట్లు మాత్రమే విడుదల అయ్యేవి..మిగతా 1500కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయేవి. దాంతో..ఆర్థికశాఖ రూ.1500కోట్లు మాత్రమే నిధులు విడుదల చేస్తుంది తప్ప..కొత్తగా ఈశాఖకు వెయ్యి కోట్లు నిధులు కావాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలకు,మంత్రులకు మంత్రి అయ్యన్న స్వయంగా ఫోన్‌ చేసి మీకు ఎన్ని రోడ్లు కావాలో చెప్పండి..? అని కోరారని..వారిని కోరడం వెనుక స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా చూసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో పరిపాలనా పరంగా విడుదలైన నిధుల ఖర్చుకాకుండానే మరో వెయ్యి కోట్లు నిధులు కావాలంటే ఎలా కుదురుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

  గతంలో 'శిద్దా' మంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి కోట్లు నిధులు ఇచ్చారని..తాను మంత్రిగా వచ్చిన తరువాత రెట్టింపు నిధులు ఇస్తారని ఆయన భావించారని...మీరు కోరిన విధంగా నిధులు ఇవ్వడం కుదరదని, వేల కోట్లు నిధులు కావాలంటే సాధ్యపడదని ఆర్థిక మంత్రి యనమల చెప్పారని..దీనిపై కోపగించుకున్న మంత్రి అయ్యన్న దీనిపైవిమర్శలు చేశారట. ఒకవైపు నిధుల లేమితో..ఆర్థికశాఖ ఇబ్బందులు పడుతుంటే..మంత్రి ఎమ్మెల్యేలకు, ఇతర మంత్రులకు ఫోన్‌చేసి ఎన్నికోట్లు నిధులు కావాలని అడగడం సరైనదేనా..అని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మంత్రిని నిలదీశారని తెలిసింది. కానీ..తాను అలా ఏమీ చేయలేదని..మంత్రి అయ్యన్న చెబుతున్నారు. తన హయాంలో రోడ్లు భవనాలశాఖ బాగా పనిచేసిందని చెప్పుకుంటారనే ఆవిధంగా ప్రపోజల్‌ పంపమని చెప్పానని మంత్రి అయ్యన్న చెబుతున్నారు. గతంలో చేసిన పనులకే రూ.1500కోట్లు చెల్లించాలని, వాటిని చెల్లించకుండానే ఇప్పుడు మళ్లీ వెయ్యికోట్లు నిధులు కావాలంటే ఎలా వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయితీరాజ్‌లో నిధులున్నా లేకున్నా.. వేల కోట్లును ఖర్చు చేసినా..అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చినా..కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకు ముందు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో..వారు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదైనా ఈ విషయంలో మంత్రి అయ్యన్న తొందరపడ్డారని, వాస్తవ విషయాలను మంత్రి యనమల సిఎం దృష్టికి తీసుకెళ్లారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

(123)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ