WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎవరి అభివృద్ధి కోసం...మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ మారారో..!?

అభివృద్ధి కోసమే పార్టీ మారాను..నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయం..గత రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇచ్చారు అని గొప్పలు చెప్పుకున్న మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఇంత వరకు ఏయే అభివృద్ధి పనులు చక్కపెట్టారో..ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి పడ్డారే తప్ప..నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాలని వైకాపా నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రిగా 'గోపాలకృష్ణారెడ్డి' బాధ్యతలు నిర్వహిస్తున్నంత కాలం ఆయన కుమారుడు ప్రమేయంతో..చిత్తూరు జిల్లాలో అధికారులు కీలకమైన పోస్టులుపొందారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చినా..మంత్రిని బాధపెట్టడం ఇష్టం లేక..చూసీ చూడనట్లు వదిలేశారు. తాజాగా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎక్సైజ్‌ డిప్యూటీ కమీషనర్‌గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిణిని చిత్తూరు జిల్లాలో నియమించాలని మంత్రి సిఫార్సు చేశారు. అప్పట్లో...సంబంధించిన ఫైల్‌ ముఖ్యమంత్రికి వెళితే ఎక్కడ తిరస్కరిస్తారో అన్న ముందు చూపుతో 'లోకేష్‌' ద్వారా సంబంధించిన ఫైల్‌ను మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి  ఆమోదింపచేసుకున్నారని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. 

 కొన్ని నెలల క్రితం అవినీతిపరుడైన అధికారిని పలమనేరు ప్రాంతంలో నియమించడం జరిగింది. ఈ అధికారి పేరు 'సింగ్‌' గనుల దోపిడీదారుగా పేరున్న గాలి జనార్థన్‌రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయనకు ఈ సింగ్‌ తోడ్పట్టారని ఆరోపణలు రావడంతో.. ఆయనను జైలులో కూడా పెట్టారు. అటువంటి అర్హతలు ఉన్న అధికారిని మంత్రి ఏరి కోరి తన నియోజకవర్గంలో నియమించు కున్నారంటే పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది. అప్పట్లో..ఈ అధికారిని ఆ ప్రాంతంలో పోస్టు వేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఆ అధికారిపై ఉన్న విమర్శలు, ఆరోపణలను ఫైల్‌లో అధికారులు రాయడం జరిగింది. అయినప్పటికీ ఆ అధికారి నియామకంపై ఎటువంటి అడ్డులేదు. మంత్రి భాషలో అభివృద్ధి అంటే ఇటువంటి అధికారులకు పోస్టింగ్‌లు వేయడమేనా..? వైకాపా ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'అమర్‌నాథ్‌రెడ్డి'ని సిఎంఒ అధికారి టిడిపిలో చేర్పించారు. మంత్రి పదవి కూడా ఆయనకు ఇప్పించారు. ఆయన చేస్తోన్న పనులకు ఈ అధికారి మద్దతు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గాలి జనార్థన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన 'సింగ్‌'ను పలమనేరులో నియమించడం ఏమిటి..? ఇదంతా సిఎంఒ అధికారి వల్లే జరిగిందని..అధికార వర్గాలు అభిప్రాయపడినా..ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సంఘటనలను అనుకూలంగా మలచుకోవడంలో వైకాపా నేతలు ఘోరంగా విఫలమవడం మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి వరంగా మారింది.

(200)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ