WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పికె' సర్వేలో 'కెసిఆర్‌'కు 56 సీట్లు...!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైకాపాకు రాజకీయ సలహాలు, సర్వేలు చేస్తోన్న 'ప్రశాంత్‌ కిశోర్‌' తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలపై నిన్న సర్వే చేసినట్లు కొన్ని వెబ్‌సైట్లు ప్రకటించాయి. ఆయన సర్వేలో అధికార టిఆర్‌ఎస్‌కు 56సీట్లు వస్తాయని తేలిందట. అసెంబ్లీ రద్దు చేసిన తరువాత...అదీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత చేసిన ఈ ప్లాష్‌ సర్వే అధికార పార్టీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువలోనే ఉందని తేలింది. సాధారణ మెజార్టీ కావాలంటే మరో నాలుగు సీట్లు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉందని...ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దాదాపు47శాతం మంది కోరుకుంటున్నారట. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఇంత వరకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉండడంతో..ఎక్కువ మంది ప్రజలు టిఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని సర్వే తేల్చింది. అయితే...అసెంబ్లీ రద్దుకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవట. 

  అసెంబ్లీ రద్దు తరువాత..టిఆర్‌ఎస్‌పై గణనీయమైన వ్యతిరేకత వచ్చిందని..గ్రామీణ ప్రాంతంలో, అర్బన్‌ ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌కు రోజు రోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే సర్వే తేల్చింది. మొత్తం 67 నియోజకవర్గాల్లో 'పికె' టీమ్‌ సర్వే చేయగా ప్రతి చోటా ఆ పార్టీకి 40శాతం మాత్రమే మద్దతు లభించిందట. ఆగస్టు 15న కెసిఆర్‌ చేయించిన సర్వేలో ఆ పార్టీ దాదాపు 69స్థానాల్లో గెలుస్తుందని తేలగా..ఇప్పుడు 56సీట్లకు వచ్చిందని..రానున్న రోజుల్లో..మరింతంగా టిఆర్‌ఎస్‌ క్షీణించబోతోందని సర్వే ఫలితాలను బట్టి తేలుతోంది. కాగా..ఈ సర్వేపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, టిడిపి,సిపిఐలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 'ప్రశాంత్‌ కిశోర్‌' సర్వేను నమ్మలేమని, ఆయన బిజెపి, జగన్‌ పార్టీల మనిషి అని.. ఈ రెండు పార్టీలు 'కెసిఆర్‌'కు స్నేహితులు కనుక...'టిఆర్‌ఎస్‌'కు ఎడ్జ్‌ ఉందని ప్రకటించారని ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని..ఆ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. కెసిఆర్‌ రోజుకో సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారని, కానీ ఆయన పప్పులు ఉడకవని..ముందస్తు ఎన్నికలతో కెసిఆర్‌ మునిగిపోవడం ఖాయమని వారు చెబుతున్నారు.  

(1289)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ