WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సిఎస్‌' పోస్టు 'పునీతా'కు ఇస్తే...సెలవులో వెళతానంటున్న 'ఎల్‌వి'...!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన కన్నా జూనియర్‌ అయిన 'అనిల్‌చంద్ర పునీతా'ను నియమిస్తే విఆర్‌ఎస్‌ తీసుకోవాలని లేదా ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని యువజనుల, క్రీడలశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1983 బ్యాచ్‌కు చెందిన తనను విస్మరించి అదే బ్యాచ్‌లో తన కన్నా జూనియర్లు అయిన 'అజయ్‌కల్లం', దినేష్‌కుమార్‌లను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే తాను కొత్త బాధపడ్డానే కానీ..ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదని, కానీ..ఇప్పుడు తన కన్నా ఒక సంవత్సరం జూనియర్‌ అయిన 'పునీతా'ను సిఎస్‌గా ఎలా నియమిస్తారని ఎల్‌వి అన్నట్లు తెలిసింది. సమర్థత, నిజాయితీతోపాటు అపార అధికార అనుభవం ఉన్న ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అవమానిస్తూ దూరంగా పెడుతున్నారో ఐఎఎస్‌ వర్గాలకు అంతుబట్టడం లేదు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుకు 'ఎల్‌వి' అత్యంత సన్నిహితుడని 'చంద్రబాబు'కు ఎవరో చెప్పడంతో..ఆయన దాన్ని  సీరియస్‌గా తీసుకుని ప్రధాన్యత లేని శాఖలో నియమించారు. ఇన్నేళ్ల సర్వీసుల్లో 'ఎల్‌వి' సర్వీసులో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఏ పత్రిక కూడా రాయలేదు. 'ఎల్‌వి' అహంకారే తప్ప..అవినీతిపరుడు కాదు..చెయ్యని తప్పుకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మూల్యం చెల్లించక తప్పలేదు. 

   ఆర్థికశాఖలో పనిచేసినా, టిటిడి ఇఒగా, వైద్యశాఖలో బాధ్యతలు నిర్వహించినా ఎక్కడా అక్రమాలకు పాల్పడినట్లు ఎవరూ ఆరోపణలు చేయలేదు. చేసే  అవకాశాన్ని ఎల్‌వి ఇవ్వలేదు. అటువంటి 'ఎల్‌వి'ని చంద్రబాబు ఎందుకు దూరం పెడుతున్నారో అనే దాన్ని పక్కన పెడితే..కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన 'పునీత'ను గతంలోనే సిసిఎల్‌ఎగా నియమించడంపై సీనియర్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిసిఎల్‌ఎగా నియమిస్తే...రాబోయే రోజుల్లో కాబోయే సిఎస్‌ అని అధికార వర్గాలు నమ్మేవి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌పి ఠక్కర్‌ రిటైర్‌ అవుతున్న సందర్భంలో 'పునీత' ఆ పోస్టును దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. 1983 బ్యాచ్‌కు చెందిన 'అజయ్‌కల్లం, ఎల్‌వి సుబ్రహ్మణ్యం' కన్నా సంవత్సరం జూనియర్‌ అయిన 'పునీతా'పై విమర్శలు, ఆరోపణలు ఆయన సర్వీసులో వ్యవహరించి తీరు చాలా మందికి తెలుసు. కానీ ఎల్‌విని విస్మరించి 'పునీతా'ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేయబోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు ఇవ్వడం వివాదాస్పద నిర్ణయంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పలు అవమానాలు సహించినా, అన్యాయం జరిగితే మౌనం వహించినా..పదే పదే అదే సంఘటనలు ఎదురు కావడంతో ఐఎఎస్‌కు స్వచ్చంధ పదవీ విరమణ పెట్టుకోవాలని, లేదా ధీర్ఘకాలిక సెలవులో వెళ్లాలని ఎల్‌వి భావిస్తున్నారని అధికారులు భావిస్తున్నా..ఇదంతా 'పునీత'ను సిపస్‌గా నియమించిన తరువాతే..జరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.

(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ