WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అతిరధ,మహారధులు నిర్వహించిన సిఎస్‌ పోస్టులో 'పునీతా'ను నియమిస్తారా..?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిసిఎల్‌ఎను నియమించేటప్పుడు సమర్థత, అధికార అనుభవం, ఏ నిర్ణయాన్నైన్నా తీసుకోవడంలో జాప్యం చేయకపోవడం వంటి అర్హతలను చూసి అప్పటి పాలకులు అధికారులను నియమించేవారు. వై.ఎస్‌ హయాంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన 'హరినారాయణ' మోహన్‌కందాలకు చిన్న చిన్న బలహీనతలు ఉన్నా సమర్థులైన అధికారులుగా పేరుంది. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఎస్వీ ప్రసాద్‌కు అధికార, రాజకీయ వర్గాల్లో ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయన తరువాత బాధ్యతలు నిర్వహించిన మినీమ్యాధ్యూస్‌ కూడా నిజాయితీ, సమర్థురాలైన అధికారిగా పేరుంది. వారందరి తరువాత సిఎస్‌గా బాధ్యతలు నిర్వహించిన ఐవైఆర్‌ కృష్ణారావు మాత్రమే వివాదాస్పదుడు అయ్యారు. అవినీతి పరులా,నిజాయితీపరులా అనే విషయాన్ని పక్కన పెడితే..కృష్ణారావు అహంకారంగా వ్యవహరించేవారు..ఏ ఒక్కరినీ లెక్కచేయరనే పేరు తెచ్చుకున్నారు. ఆయన తరువాత సిఎస్‌ అయిన 'ఠక్కర్‌' సిఎస్‌ పోస్టు ప్రతిష్టను మంటగలిపారనే విమర్శలు వచ్చాయి. 18 నెలల క్రింద ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా 'దినేష్‌కుమార్‌'ను నియమించగా, సమర్థత,సీనియార్టీని చంద్రబాబు గుర్తించారనే పేరు వచ్చింది. అప్పటి వరకు సిఎస్‌ పోస్టు ప్రతిష్టను మంటగలిసిన నేపథ్యంలో ఆ పోస్టుకు విలువను తెచ్చారు...అధికార ఉద్యోగవర్గాల్లో బాధ్యత పెరిగింది. పలు జిల్లాల కలెక్టర్లు కూడా సిఎస్‌ పట్ల గౌరవ, వినయవిధేయతలు ప్రదర్శించారు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిబంధనల ప్రకారంనిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు ఉండడమే. ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రం వరకు ఎంతో మంది సమర్థులైన వారు సిఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. వారిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సెప్టెంబర్‌ మాసాంతంలో రిటైర్‌ కాబోతున్న నేపథ్యంలో సిసిఎల్‌ఎగా పనిచేస్తోన్న 'పునీత'ను సిఎస్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. సిఎస్‌ పోస్టును ఎవరెవరు ఎంత కాలం నిర్వహించారు...? అటువంటి పోస్టులో 'పునీతా' నియమించబోతున్నారా..? వివిధ హోదాల్లో పనిచేస్తోన్న క్రిందిస్థాయి అధికారులు, హెచ్‌ఒడిలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమిటంటే 'పునీత' ఇంత వరకు ఏయే శాఖల్లో ఉన్నతాధికారులుగా బాధ్యతలు నిర్వహించారో..ఆయా శాఖల ఉద్యోగులకు, క్రిందిస్థాయి అధికారులకు ఆయన బలహీనతలు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సిఎంఒ అధికారులకు 'పునీత' వ్యవహారం తెలిసినప్పటికీ ఆయనను సిఎస్‌గా నియమించేందుకు రంగం సిద్ధం అయిందంటే...ఎటువంటి లక్షణాలు ఉన్న అధికారిని సిఎస్‌గా నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారో..?

(224)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ