WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఉమ'ను వైఎస్సే ఓడించలేకపోయారు..వసంతా, జగన్‌లు ఓడించగలరా..!?

కడప నుండే కాదు...ఏ ప్రాంతం నుండి ఎంత మంది రౌడీ మూకలను తెచ్చినా..దౌర్జన్యాలు చేసి..ఓటర్లను భయభ్రాంతులను గురిచేయాలని చూసినా..నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనను గెలిపిస్తారని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన 'జనమ్‌ప్రత్యేక ప్రతినిధి'తో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఏ ప్రాంతం నుండి గుండాలు కానీ..మరే ప్రాంతం నుంచి వస్తే..స్థానికులు తరిమికొడతారన్నారు. కృష్ణా జిల్లాలో ఇంత వరకు ఏ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. నన్ను టార్గెట్‌గా చేసుకుని ఓడించాలని..'జగన్‌' భావిస్తే...ఆయన స్వయంగా రంగంలో దిగినా..ఆయనను ఓడించి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి, అక్రమాలు లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ కార్యక్రమాలు, ఫించన్లు ఇప్పించాను. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశాను. ఓటర్లలో నాపై వ్యతిరేకత వ్యక్తం కాలేదు. 'జగన్‌' తండ్రే నన్ను ఓడించడానికి విశ్వప్రయత్నాలు చేశారు..నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా..ఓటర్లు నన్నే గెలిపించి భ్రమ్మరథం పట్టారు. అంత రాజశేఖర్‌రెడ్డే ఏమీ చేయలేకపోయారు. 'జగన్‌' మాత్రం నన్నేం చేయలేరని అన్నారు. ఎవరెవరు..ఏ విధంగా నాకు వ్యతిరేకంగా పనిచేసినా..మైలవరంలో నాకే మద్దతు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై  ఉన్న ఆధరాభిమానాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నాపై పోటీ చేయాలన్నా..నన్ను ఓడించాలనుకున్నా...పోటేలు కొండను ఢీ కొన్న పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వైకాపా అభ్యర్థి కోట్లు ఖర్చుపెట్టినా...సొమ్ములు తీసుకున్నవారు కూడా నాకే ఓటు వేసి గెలిపిస్తారని 'దేవినేని ఉమ చెబుతున్నారు. నాలుగేళ్లు జలవనరులశాఖ మంత్రిగా నిజయితీగా,సమర్థవంతంగా బాధ్యతలునిర్వహించారు. ఇంత వరకు నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలులేవు. వైకాపా నాయకులు విమర్శలు చేసినప్పుడు రుజువులు చూపితే...రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పాను..ఏ నాయకుడూ ముందుకు రాలేదు. మా నేత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై 80శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్నికల్లో ఓడించాలని ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి విఫలమై ఏమీ చేయలేక..మౌనం వహించారు. కుప్పంలో ఉన్నంత పార్టీ బలం మైలవరంలో లేకపోయినా...అఖండ మెజార్టీతో నేను మళ్లీ విజయం సాధించడం ఖాయం అని మంత్రి దేవినేని పూర్తి ధీమా వ్యక్తం చేశారంటే స్థానిక పరిస్థితులు ఆయనకు ఎంత అనుకూలంగా ఉన్నాయో స్పష్టం అవుతుంది. నందిగామ నియోజకవర్గంలో 1994లో మా సోదరుడు దేవినేని రమణ విజయం సాధించి సంచలనం సృష్టించారు..దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో రమణ వారసుడిగా..1999లో అఖండ మెజార్టీతో గెలిపించారు..2004లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా వీచినా..నందిగామ ఓటర్లు మళ్లీ నన్ను గెలిపించారు..నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 'నందిగామ' నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ చేయడంతో మైలవరం నుంచి 2009లో పోటీ చేశాను. అప్పట్లో ఈ నియోజకవర్గంలో మాజీలంతా తనను ఓడించడానికి ప్రయత్నించారు. కానీ..ఓటర్లే నాకు పట్టం కట్టారు. 2014లో కూడా నేను ఓడిపోతానని చాలా మంది బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దానికి కారణాలు ఏమిటంటే..1978 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గంనుండి ఒక్కసారి గెలిచిన వారు మరోసారి గెలవలేదనే సెంటిమెంట్‌ ప్రభావం నాపై పనిచేయడం ఖాయమని భావించారు. కానీ..మైలవరం ఓటర్లు సెంటిమెంట్‌ను పక్కన పెట్టి నియోజకవర్గ ఓటర్లు తనను గెలిపించి ఇంత స్థాయికి తెచ్చారు..రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నన్ను ఓడించడం 'జగన్‌'కే కాదు...ఇంకెవరికీ సాధ్యపడదని...ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడినా..ఓటర్లును ప్రలోభాలకు గురి చేయాలని చూసినా...అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకోదు..అటువంటి సంఘటనలకు తాను పాల్పడినా..వారు సహించరని చెప్పారు.

(బి.ఆర్‌.కె.మూర్తి)

(1588)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ