WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మండవ' మళ్లీ లైనులోకి వచ్చాడు...!

ఆయన టిడిపిలో సీనియర్‌ నాయకుడు. ఆంధ్రా మూలాలు ఉన్న ఈ నాయకుడు..తెలంగాణలో ఒకప్పుడు పేరు మోసిన నేత. నిరాండబరుడు, నిజాయితీపరుడు, సమర్థుడైన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో వివిధ శాఖలను నిర్వహించి శెభాష్‌ అనిపించుకున్నాడు. రైతాంగ మూలాలను మరిచిపోని..ఆయన ఎమ్మెల్యేగా ఉన్నరోజుల్లో...ఆయనను నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారు. అప్పట్లో...మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారంటే..దాదాపు చంపేయడం ఖాయం. నక్సైట్లు కిడ్నాప్‌ చేసిన నాయకులను ప్రాణాలతో వదలడం అంటూ ఉండదు. కిడ్నాప్‌ అయిన వ్యక్తులపై ఉన్న అభియోగాలను, ఇతర ఆరోపణలను అక్కడే ప్రకటించి చంపేస్తుంటారు. ఆ రోజుల్లో తెలంగాణలో పది రోజులకో..ఇరవై రోజులకో..ఇటువంటి కిడ్నాప్‌లు నిత్యం జరుగుతూ ఉంటాయి..పత్రికల్లో పతాకస్థాయిలో వార్తలు ఉంటాయి...? ఎవరో నేతను నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారని..ఒక రోజు..మరో రోజు..వారిని చంపేశారని వార్తలు నిత్య కృత్యమే...? అటువంటి పరిస్థితుల్లో టిడిపికి చెందిన ఎమ్మెల్యేను నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే దొరికితే ఇక నక్సలైట్లు ఊరుకుంటారా..? చంపేస్తారనే..అందరూ భావించారు..నక్సలైట్ల ఉద్దేశ్యం కూడా అదే. మారు మూల ప్రాంతమైన...నిజామాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సదరు ఎమ్మెల్యేను తీసుకుని వెళ్లి..అక్కడ ప్రజలను ఆయన గురించి..అడిగారు..? ఈయన మీ ఎమ్మెల్యే.. మీకేమైనా పనిచేశాడా..? మీకేమైనా హాని చేశాడా..? ఏమైనా ఆరోపణలున్నాయా..? అని ప్రశ్నించారు..? ఒక్కరు ఆరోపణలు చేసినా..చంపేదామనే ఆలోచనతో ఉన్న నక్సలైట్లకు ఆ ఎమ్మెల్యేను ఎన్ని ఊళ్లు తిప్పినా..ఒక్కరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో..ఆయన నిజాయితీని గుర్తించిన నక్సలైట్లు చివరకు ఆయనను వదిలేయక తప్పలేదు. అటువంటి నిజాయితీ పరుడైన..ఆ ఎమ్మెల్యే తరువాత మంత్రిగా కొన్నాళ్లు పనిచేశారు. ఎన్నికల్లో కొన్నిసార్లు గెలిచారు..మరి కొన్ని సార్లు ఓడిపోయారు..? తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరువాత...ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. గత ఎన్నికల సమయంలో అసలుపోటీనే చేయలేదు..? ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు స్నేహితుడైన ఈ నేత..ఇప్పుడు మళ్లీ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. మళ్లీ పోటీకి సిద్ధం అవుతున్నారు..? స్నేహితుడు కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌లోకి రమ్మని పిలిచినా...ఆయన వెళ్లలేదు. సొంత పార్టీ నుంచే పోటీకి సిద్దం అవుతున్న ఆ నేత ఎవరో కాదు..ఆయనే 'మండవ  వెంకటేశ్వరరావు'.

  నిదానపరుడు, ఆలోచనాపరుడు, నిజాయితీపరుడు, సమర్థుడైన 'మండవ' ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. 1989లో నిజామాబాద్‌ జిల్లా 'డిచ్‌పల్లి' నుంచి తొలిసారి గెలిచిన 'మండవ' తరువాత 1994,1999లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. తరువాత 2004 ఎన్నికల్లో ఆయన తొలిసారి పరాజయంపాలయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయనకు మరోసారి పరాజయం ఎదురైంది. అయితే 2009లో నిజామాబాద్‌ రూరల్‌  నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలోకి మళ్లీ అడుగుపెట్టారు. అయితే...తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో తాను ఇమడలేనని ఆయన స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల కాలంలో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నియమించిన పొత్తుల కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్థికంగా స్థోమత లేదని..ఆయన 'లోకేష్‌' తదితరులతో చెప్పడంతో..ఆర్థిక విషయాలు తాము చూసుకుంటామని..పోటీకి సిద్ధం కావాలని వారు చెప్పడంతో..ఇప్పుడు మరోసారి..ఆయన ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.   నిజాయితీపరుడైన 'మండవ' ఎన్నికల బరిలో ఉండడంతో..తాము గెలుస్తామనే భావన జిల్లా నేతల్లో వ్యక్తం అవుతోంది. మరో వైపు కాంగ్రెస్‌, టిడిపి పొత్తుతో తన స్నేహితుడు ఓడిపోవడం ఖాయమని అభిప్రాయంతో 'మండవ' ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులతో చెబుతున్నారట. కాంగ్రెస్‌,టిడిపి పొత్తుతో..తన గెలుపు ఖాయమైందని..అదే సమయంలో కెసిఆర్‌ ఓటమి కూడా రంగం సిద్ధమైందని..గెలిచే జట్టులో తాను ఉన్నానని ఆయన అంటున్నారట. మొత్తం మీద..విద్యావంతుడు, వివాదరహితుడు, నిరాండబరుడు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు మళ్లీ ప్రజల మధ్యకు రావడం ఎంతైనా హర్షించదగిన  విషయమే. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ 'మండవ' గారూ..!

(11455)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ