WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రెడ్డి' సామాజికవర్గాన్ని 'కెసిఆర్‌' లక్ష్యంగా చేసుకున్నారా..!?

కాంగ్రెస్‌,టిడిపి పొత్తు తన అధికారానికి చరమగీతం పాడుతుందేమోనన్న ఆందోళనతో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో తనకు ప్రధాన అడ్డంకి అని భావిస్తోన్న 'రెడ్డి' సామాజికవర్గ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికలంటూ...అసెంబ్లీని రద్దు చేసి...ఆగమేఘాలపై ఎన్నికలకు సిద్ధమవుతోన్న కెసిఆర్‌ తనకు ఇబ్బంది కల్గిస్తారనే వారినందరినీ ఏదో ఒక కేసు పేరుతో జైలు పాలు చేస్తున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. నిన్న మెదక్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు 'జయప్రకాష్‌రెడ్డి'ని మహిళల అక్రమ రవాణా కేసు అంటూ జైలుకు పంపించిన 'కెసిఆర్‌' ఈ రోజు 'రేవంత్‌రెడ్డి'కి పోలీసుల నుంచి నోటీసులు ఇప్పించారు. ఆయన తరువాత వరంగల్‌కు చెందిన గండ్ర వెంకటరమణారెడ్డిని ఆయుధాల కేసులో అరెస్టు చేశారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ప్రధాన నాయకులను రెండు రోజుల్లో అరెస్టులు చేయించడంతో...కెసిఆర్‌ ఆ వర్గాన్ని లక్ష్యం చేసుకున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

  2004లో జరిగిన పాస్‌పోర్ట్‌ కేసును ఇప్పుడు అర్జెంట్‌గా బయటకు తెచ్చి...'జయప్రకాష్‌రెడ్డి'ని అరెస్టు చేయించారని..ఇప్పుడు అంత అర్జెంట్‌గా కేసుల విచారణ వేగంగా జరగాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ తెలియదు. నాలుగేళ్ల నుంచి అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ఈ కేసు గురించి...ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దానిలో నిందితుడు అంటూ..'జయప్రకాష్‌రెడ్డి'ని అరెస్టు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు 'హౌసింగ్‌ సొసైటీ'లో అక్రమాలు చేశారంటూ..'రేవంత్‌రెడ్డి'కి జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో నేడో రేపో అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయుధాల అక్రమ రవాణా కేసులో 'గండ్ర వెంకటరమణారెడ్డి'ని అరెస్టు చేశారు. మొత్తం మీద..ఒకే సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలను వివిధ కేసుల్లో అరెస్టు చేయించడం వారిని భయపెట్టడానికే అన్న విమర్శలు వస్తున్నాయి. ఓడిపోతాననే అసహనంతోనే 'కెసిఆర్‌' ఇటువంటి అరెస్టులు చేయిస్తున్నారని వీటికి తాము భయపడే ప్రసక్తేలేదని...కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కాగా..త్వరలోనే ఓటుకు నోటు కేసును కూడా బయటకు తెస్తారని..తద్వారా.. టిడిపి నేతలను, చంద్రబాబును కట్టడి చేయాలనే ఆలోచన టిఆర్‌ఎస్‌ పెద్దలకు ఉన్నట్లు తెలుస్తోంది.  

(441)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ