WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌' ఓడిపోతున్నాడని..ఆయన స్నేహితుడే చెబుతున్నాడు...!

వాళ్లిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు...! ఒకే వయస్సు వారు కావడం...ఒకే పార్టీలో సుధీర్ఘకాలం పనిచేసిన సమయంలో వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహమే ప్రాణస్నేహమైంది. ఒకేపార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు..మంత్రులుగా పనిచేశారు..ప్రతిపక్షంలో కలసి పనిచేసి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేసి విజయం సాధించారు. పార్టీ సమావేశాల్లో, కార్యకర్తల శిక్షణా తరగతుల్లోనూ..విడదీయకుండా కలసి మెలసి తిరిగేవారు. వారి స్నేహం..మిత్రుల దగ్గర నుంచి మొదలై చివరకు... ఏరా..అంటే..ఏరా అనుకునే స్థాయికి చేరింది. కాలం మారిపోవడంతో..హోదాలు మారిపోయాయి...ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే..మరొకరు..రాజకీయాల నుంచి తప్పుకుని ఇటీవల కాలం వరకు రాజకీయంగా విశ్రాంతి తీసుకున్నారు.  రాజకీయంగా ఎలా ఉన్నా ఖాళీ సమయం దొరికితే..మిత్రులిద్దరూ కలసి సాయంత్రాలను ఎంజాయ్‌ చేస్తుంటారు. సాయంత్రం అయితే...ఇద్దరూ కలసి మూతలు విప్పదీసి ఆస్వాదిస్తుంటారు. వారి చర్చల్లో..అప్పటి రాజకీయ పరిస్థితులు... కుటుంబ పరిస్థితులు...ఇతర అంశాలు చర్చకు వస్తాయి. వాదోపవాదాలు..చర్చలు జరుగుతాయి.. ! ముఖ్యమంత్రి హోదాలో తన మిత్రుడు ఉన్నా...ఆ నాయకుడు మాత్రం అతన్ని ఏరా అనే సంభోధిస్తారు..ఆ ముఖ్యమంత్రి కూడా అలా పిలిపించుకోవ డానికే ఇష్టపడతారు. అటువంటి మిత్రులు ఎవరనుకుంటున్నారా..? వారే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, టిడిపి సీనియర్‌ నేత 'మండవ వెంకటేశ్వరరావు'.

  ఇప్పుడంటే వేర్వేరు పార్టీలో ఉన్నారు కనుక..హోదాలు..ఇతర విషయాలు పక్కనున్న వారిని ప్రశ్నార్థకంగా చూసేలే చేస్తున్నాయి. కానీ..ఒకప్పుడు ఒకటే కారు..ఒకటే కంచం..ఒకటే బాటిల్‌ అన్నట్లుండేది వారి వ్యవహారం. కెసిఆర్‌ ముఖ్యమంత్రి అయినా..'మండవ'తో దోస్తీ మాత్రం మానలేదు. ఇటీవల కాలం దాకా..తన ప్రియ స్నేహితుడిని పార్టీలోకి తీసుకురావడానికి కెసిఆర్‌ ప్రయత్నించారు. కానీ..'మండవ' ఆ ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించారు. ఒక దశలో ఆ ఒత్తిడి తట్టుకోలేక..పార్టీ మారదామనే అనుకున్నారు. కానీ...కెసిఆర్‌ ఎప్పుడైతే..ముందస్తు ఎన్నికలు..అని రంగంలోకి దిగారో..'మండవ' మనసు మార్చుకున్నారట. టిఆర్‌ఎస్‌,టిడిపి పొత్తుతో పోటీ చేస్తే...'మండవ' ఎటువంటి నిర్ణయం తీసుకునేవారో కానీ...ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ఒంటరిగా, టిడిపి, కాంగ్రెస్‌ కలసి పనిచేస్తుండడంతో..తాను టిఆర్‌ఎస్‌లో చేరనని, టిడిపిలోనే ఉంటానని..అవసరమైతే..టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారట. ఇదేమిటి..మిత్రుడు పార్టీ...గెలిచే పార్టీ మీ మరో మిత్రుడు 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ చెబుతున్న పార్టీలో చేరకుండా...టిడిపిలోనే ఉంటానని ఎందుకు చెబుతున్నారని సన్నిహితులను ప్రశ్నించగా...టిఆర్‌ఎస్‌ గెలవదని...తన స్నేహితుడు 'కెసిఆర్‌' ఓడిపోతున్నారని ఆయన వారితో చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లో కెసిఆర్‌ గెలిచే సమస్య లేదని, టిడిపి, కాంగ్రెస్‌లతో కూడిన 'మహాకూటమి' తెలంగాణలో అధికారంలోకి వస్తుందని గట్టిగా చెబుతున్నారట. ఆయన విశ్వాసం చూసిన టిడిపి నేతలకు ఎనలేని ఉత్సాహం వస్తోందట. మొత్తం మీద..ప్రియ స్నేహితుడే 'కెసిఆర్‌' గెలవలేడని చెబుతుంటే...కెసిఆర్‌కు మరో స్నేహితుడై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం గెలుస్తాడని సర్వేలు వేస్తుండడం విశేషం.

(9625)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ