WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణలో టిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే...!

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 'మహాకూటమి' ఖాయమైన నేపథ్యంలో...ఆ కూటమిలో ఉండేపార్టీల మధ్య సీట్ల పంపిణీపై కసరత్తు జరుగుతోంది. 'మహాకూటమి'లో కాంగ్రెస్‌ తరువాత అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశంపార్టీ తాను పోటీ చేయబోయే స్థానాలపై ఇప్పటికే ఒక జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. దాదాపు 40స్థానాల్లో టిడిపి తాను పోటీ చేయాలని భావిస్తుండగా...కాంగ్రెస్‌ మాత్రం 15 నుంచి 20సీట్లు ఇవ్వాలని ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల తరువాత తెలుగుదేశం బలం బాగా క్షీణించిందని 15సీట్లు మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్‌ అంటోందని తెలుస్తోంది. అయితే టిడిపి మాత్రం 40సీట్లలో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మలేదని..తమ పార్టీని 15స్థానాల్లో గెలిపించారని మరో 17 స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నామని అది తమ బలమని..ఇప్పుడూ...అదే స్థాయిలో ఉన్నామని చెబుతోంది. అయితే..కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు ఉన్నా..నాయకులు లేరని...ఇప్పుడు అన్ని సీట్లలో పోటీ చేస్తే..టిఆర్‌ఎస్‌ లాభపడుతుందని...కాంగ్రెస్‌ చెబుతోందట. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు ఇలా చెబుతుండగా..ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాత్రం టిడిపి పట్ల సానుకూలవైఖరితో వెళ్లాలని చెబుతున్నారట. కాగా..టిడిపి మాత్రం ఒక లిస్ట్‌ తయారు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఆ లిస్ట్‌ ప్రకారం తమకు సీట్లు ఇవ్వాలని కోరుతోందట. టిడిపి వర్గాలు, ఇతర వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం టిడిపి కోరే సీట్లు ఇవేనని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రకారం:-

హైదరాబాద్‌: సతన్‌నగర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌,జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌

రంగారెడ్డి:కుత్బుల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, ఎల్‌బినగర్‌, మహేశ్వరం, మేడ్చల్‌,ఉప్పల్‌,రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, శేఠిలింగంపల్లి,

ఖమ్మం:సత్తుపల్లి, యెల్లెందు, ఖమ్మం, పాలేరు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం

మెదక్‌:పటాన్‌చెరువు, గజ్వేల్‌

ఆదిలాబాద్‌: ఖానాపూర్‌

కరీంనగర్‌:జగిత్యాల్‌,హుస్నాబాద్

నల్లగొండ:దేవరకొండ, కోదాడ

మహబూబ్‌నగర్‌: నారాయణపేట,మక్తల్‌, దేవరకద్ర,అచ్చెంపేట,వ‌న‌ప‌ర్తి

వరంగల్‌:పాలకుర్తి, పరకాల,న‌ర్సంపేట‌

నిజామాబాద్‌: నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌

పైన పేర్కొన్న 38సీట్లతో పాటు మరో ఐదు సీట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో ఏ పార్టీకి ఏ సీటు ఇవ్వాలనేది తేలుతుంది. టిడిపి వర్గాల అంచనాల ప్రకారంపైన చెప్పిన సీట్లును టిడిపి గట్టిగా పట్టుపట్టబోతోంది. టిడిపికి గట్టు రోజులు ఉన్నప్పుడు కూడా పైన చెప్పిన మెజార్టీ సీట్లలో టిడిపి కొన్ని సీట్లు గెలిచింది. మరి కొన్ని సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు పరిస్థితులు మారడం, టిఆర్‌ఎస్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో పాటు 'మహాకూటమి'లో టిడిపి ఉండడం ఆ పార్టీ అభ్యర్థులు గెలుపుతో పాటు కూటమి గెలుపు కూడా సాధ్యం కానుంది.

(5828)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ