WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వెంకటగిరి' బరిలో 'రామకృష్ణా...లేక 'కొమ్మినేని'నా...!?

నెల్లూరు జిల్లా 'వెంకటగిరి' నియోజకవర్గంలో 1978 నుండి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఒకసారి విజయంసాధించిన వారు మరోసారి అక్కడ నుంచిపోటీ చేయకపోవడమో..లేదా ఎన్నికల్లో ఓడిపోవడమో..జరిగింది. అదే విధంగా రెండుసార్లు వరసుగా విజయం సాధించి మూడవసారి ఎన్నికల్లో ఓడిపోయి...హ్యాట్రిక్‌నుపొందలేకపోయారు మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి. అదే విధంగా 2009,2014ల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించి..మూడోసారి కూడా ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన నేతగా పేరు పొందాలని తపన పడుతున్నారు రామకృష్ణ. నియోజకవర్గంలో 1978లో కీ.శే. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించగా 1983లో ఆయన సోదరుడు నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కీ.శే. నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. 1989లో నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మళ్లీ టిడిపి తరుపున పోటీ చేసి..కీ.శే. నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై ఓడిపోవడం జరిగింది. 1985లో 'చంద్రశేఖర్‌రెడ్డి'కి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా వెంకటగిరి జమీందార్‌ వారసుడైన రాజాకు అవకాశం ఇవ్వడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1994లో నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై వెంకటగిరి జమిందార్‌ మాజీ ఎమ్మెల్యే యాషేంద్ర తండ్రి విజయంసాధించారు. 1999, 2004ల్లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి టిడిపి అభ్యర్థిపై విజయం సాధించి మంత్రి పదవి కూడా నిర్వహించి మూడవ సారి విజయం సాధించి రాజకీయంగా తెరమరుగు అయ్యారు. అదృష్టం కలసి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిన 'రామకృష్ణ' నేదురుమల్లి రాజ్యలక్ష్మిని ఓడించి..ఆ జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మిలక్ష్మయ్యనాయుడు వైకాపా అభ్యర్థిగా పోటీ చేయడంతో 'రామకృష్ణ' అదృష్టం కలసి వచ్చి విజయం సాధించారు. 

  రెండుసార్లు అదృష్టం కలిసి వచ్చిన 'రామకృష్ణ' హ్యాట్రిక్‌ సెంటిమెంట్‌కు బలి అవుతారా..? లేదా హ్యాట్రిక్‌ సాధించి సంచలనం సృష్టిస్తారా..? నిన్నా..మొన్నటి వరకు 'రామకృష్ణ'కు వ్యతిరేక పవనాలు బాగా వీచాయి. నోటి దురుసు తనంతో పాటు..అకారణంగా ఆగ్రావేశాలు వ్యక్తం చేయడంతో పాటు వెంకటగిరిలో జరుగుతున్న అవినీతిని అరికట్టలేకపోయారనే  విమర్శలు ఉన్నాయి. 'వెంకటగిరి' గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరిగినా 'రామకృష్ణ' మౌనం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అదృష్టం మరో రూపంలో కలసి వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో రామకృష్ణపై ఓడిపోయిన 'కొమ్మి లక్ష్మయ్యనాయుడు' త్వరలో టిడిపిలో చేరబోతున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 'కొమ్మి'కి పట్టు ఉంది. ఓటర్లల్లో, కార్యకర్తల్లో వ్యతిరేకత ఉన్న 'రామకృష్ణ'ను తప్పించి...'కొమ్మి'కి టిడిపి టిక్కెట్‌ ఇచ్చే అవకాశం ఉందని 'నెల్లూరు'లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా..హ్యాట్రిక్‌ సాధించాలని తపన పడుతున్న మళ్లీ పోటీ చేసే అవకాశాన్ని చంద్రబాబు కల్పిస్తారా..? లేదా పార్టీలో చేరబోతున్న 'కొమ్మి'కి అవకాశం ఇస్తారా.? అనే విషయంలో ఆయన అంతరంగం బయటపడడం లేదు. కానీ..టిడిపి, స్వతంత్య్ర ఎమ్మెల్యేగా పోటీ చేసిన 'కొమ్మి' అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను అభ్యర్థిగా ప్రకటిస్తే..పార్టీకి కలసి రావచ్చు. సెంటిమెంట్ల ప్రభావం పనిచేస్తుందా..? లేదా ఇతర రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తాయోమో కానీ..మళ్లీ తనకు పోటీ చేసే అవకాశం వస్తుందా..? రాదా..అనే ఉత్కంఠతో 'రామకృష్ణ' ఎదురు చూస్తున్నారు. 'చంద్రబాబు' ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో..వేచి చూడాల్సిందే.

(181)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ