WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వేణుగోపాల్‌రెడ్డి'ని...గుంటూరు పొమ్మంటోంది..మాచర్ల వద్దంటోంది...బాపట్ల..ఏమంటుందో..?

2009లో గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీగా విజయం సాధించిన వేణుగోపాల్‌రెడ్డికి ఆ తరువాత జరిగిన రాజకీయ మార్పులతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో ఆయన మళ్లీ అక్కడ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ వేణుగోపాల్‌రెడ్డికి అక్కడ టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు లేవు. తనకు నర్సరావుపేట ఎంపీ సీటు ఇచ్చినా పోటీ చేస్తాను..లేదా...మాచర్ల కానీ బాపట్ల నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చినా..ఎన్నికల బరిలోకి దిగుతానని ఆయన చెబుతున్నారట. మాచర్ల నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థుల్లో ఏ ఒక్కరికైనా టిక్కెట్‌ ఇస్తే..తాను గెలిపిస్తానని 'గురజాల' ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'బాపట్ల' ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి నగరాధ్యక్షుడు 'చందూ సాంబశివరావు'ను పోటీ చేయించాలని 'చంద్రబాబు' భావిస్తున్నట్లు తెలిసింది. బాపట్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఓడిపోయిన అన్నం సతీష్‌ప్రభాకర్‌కు మూడేళ్ల క్రిందట స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. ఆ పదవీ కాలం మరో మూడేళ్లు ఉండడంతో..తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని 'అన్నం' చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవికి మూడేళ్లు గడువు ఉంది కదా...? సామాజికవర్గాలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గంలో 30వేలు ఓట్లుపైగా రెడ్డి సామాజికవర్గ ఓట్లు ఉన్న నేపథ్యంలో తనకు పోటీ చేసే అవకాశం ఇస్తే..విజయం సాధించి తీరుతానని 'వేణుగోపాల్‌రెడ్డి' ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుండి వ్యయప్రయాసలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను..స్థానికుడినైన తనకు అవకాశం ఇవ్వకుండా 'వేణుగోపాల్‌రెడ్డి'కి ఎలా అవకాశం ఇస్తారని 'అన్నం' ప్రశ్నించవచ్చు.

  ఇప్పటికే చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు 'అన్నం' అభ్యర్థి అని సూచించారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. గుంటూరు వద్దు..పొమ్మంటుంది...మాచర్ల రావద్దంటోంది...బాపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నపథ్యంలో 'వేణుగోపాల్‌రెడ్డి' రాజకీయ పరిస్థితి ఏమిటి..? ఆయన సామాజిక ఓటర్లతో పాటు, బంధువుల్లో మెజార్టీ ఓటర్లు వైకాపా అధినేత 'జగన్‌'కు మద్దతు ఉన్న నేపథ్యంలో బాపట్ల నియోజకవర్గంలోని ఓటర్లలో చీలిక రాదు..ఒకవేళ వేణుగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ ఇస్తే...ఘోరంగా ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారుస్థానిక నేతలు. పరిస్థితి ఈ విధంగా ఉంటే కక్కలేక మింగలేక రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు వేణుగోపాల్‌రెడ్డి. పరోక్షంగా 'చంద్రబాబు'పై చేస్తోన్న విమర్శలు, వ్యంగ్యారోపణలు ఆయన దృష్టికి వెళ్లాయని..అందుకే ఆయననుపూర్తిగా దూరం పెట్టాలని 'చంద్రబాబు' నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. బంధువుల్లో ఎక్కువ మంది 'జగన్‌'కుమద్దతుఇవ్వడం 'వేణుగోపాల్‌రెడ్డి'కి శాపంగా మారిందని చెప్పవచ్చు. కుల సమీకరణలను బట్టి, ఇతర సమీకరణాలను బట్టి..ఎవరెవరిని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనే దానిపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో 'వేణు' పరిస్థితి ఏమిటో..అర్థం కావడం లేదు. వేణుగోపాల్‌రెడ్డి వైకాపాలో చేరతారని గత రెండేళ్ల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన దీనిని పెద్దగా ఖండించిన దాఖలాలు లేవు. మరి ఏం జరుగుతుందో చూడాలి.  

(231)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ