WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాధాకృష్ణ' కంటే ఘనుడు 'నాయుడు'...!

'అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న' అన్నట్లు...తెలంగాణలో మీడియా 'కెసిఆర్‌'ను కీర్తించడంలో ఒకరినిమించి ఒకరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రా మూలాలు ఉన్న మీడియా అధిపతులు..కెసిఆర్‌ను కీర్తించడంలో పోటీ పడి..'దొర' దగ్గర మార్కులు కొట్టెయ్యడానికి ప్రయాసలు పడుతున్నారు. ముందస్తు ఎన్నికల్లో ఒకరేమో...కెసిఆర్‌కు 80సీట్లు వస్తాయని ప్రకటిస్తే...మరొకరేమో...95 సీట్లు వస్తాయని..తమ రాజభక్తిని చాటుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసు కోకుండా..తమ అవసరాల కోసం..వండి వార్చిన సర్వేలను ప్రజలపై రుద్దాలని ప్రయత్నాలు చేస్తూ అభాసుపాల వుతున్నారు. తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌కు 80స్థానాలు వస్తాయని..పోయిన వారం తన వ్యాసంలో 'రాధాకృష్ణ' రాసుకుని అభాసుపాలైతే..ఇప్పుడు అదే దారిలో టివీ5 కూడా నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌ పార్టీకి 95స్థానాలు వస్తాయని, ఇది తాము మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ టీమ్‌తో కలి చేసిన సర్వేలో తేలిందని టివి5 ఘనంగా ప్రకటించింది. టివి5 సర్వే చూసిన వారంతా..'రాధాకృష్ణ' కంటే ఘనుడు 'నాయుడు' అంటూ తేల్చేస్తున్నారు.

   ఒకవైపు తెలంగాణ సమాజం మొత్తం..కెసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలేమీ నెరవేర్చలేదని మండిపడుతుంటే..కెసిఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సర్వేలు ఏమిటి..? రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు,మధ్యతరగతి వర్గాలు, పేదలు కెసిఆర్‌ పాలనపై పెదవి విరుస్తుంటే...95సీట్లు వస్తాయా..? ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని..కెసిఆర్‌ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ నెత్తిన పెట్టుకుంటారా..? తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికలకు సిద్ధం కాలేదని, వారికి నాయకుడు లేడని, కెసిఆర్‌ను తెలంగాణ సమాజం నాయకునిగా గుర్తించందని..అందుకే ఆయనకు అన్ని సీట్లు వస్తాయని ప్రచారం చేయడం సరైందేనా..? ఒకవైపు టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేయవద్దని..గ్రామాలకు..గ్రామాలు తీర్మానాలు చేసుకుంటూ..వ్యతిరేకతను చాటిచెపుతోన్న తరుణంలో..వండివార్చిన సర్వే వేయడం ఏమిటి..? టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేయవద్దని..ఎప్పుడూ లేని విధంగా గ్రామాల్లోని గోడలపై ప్రజలే స్వచ్చంధంగా రాస్తున్న విషయం ఈ సర్వే చేసిన వారికి తెలియదా..? ముందస్తు ఎన్నికలంటూ..ముందస్తు ఎన్నికల ప్రచార సభలు అంటూ హోరెత్తించిన కెసిఆర్‌ ఎందుకు వాటి గురించి మాట్లాడడం లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను..గమనించే...ఇప్పుడు వెనక్కు తగ్గారా..? లేక ముందస్తు ఎన్నికలు జరగవు కనుక..ఏదో విధంగా వచ్చిన గ్యాప్‌ను తగ్గించడానికి వండివార్చిన సర్వేలను ముందుకు తెస్తున్నారా...? ఏమో..నిన్న మొన్నటి దాకా..ఆంధ్రజ్యోతి 'రాధాకృష్ణ' ఒక్కరే కెసిఆర్‌ భజన చేస్తున్నారని భావిస్తే...ఇప్పుడు ఆయనకు 'నాయుడు' తోడయ్యారని..ఇద్దరూ కలసి కెసిఆర్‌ను మునగచెట్టు ఎక్కిస్తున్నారని మీడియా వర్గాలు హేళనగా మాట్లాడుతున్నాయి.  

(1045)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ