WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆత్మకూరు' టిడిపి అభ్యర్థిగా 'బొల్లినేని కృష్ణయ్య'...!

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను పార్టీలో చేర్చుకుని 'ఆత్మకూరు' టిడిపి అభ్యర్థిగా చంద్రబాబు త్వరలో ప్రకటించబోతున్నారు. కొద్ది రోజుల కిందట జరిగిన సమావేశంలో నెల్లూరు ఎంపి అభ్యర్థి ఇతర నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు...ఆత్మకూరులో వైకాపాను తట్టుకోవాలంటే 'బొల్లినేని'కి మాత్రమే సాధ్యపడుతుందని..అదే విధంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మిలక్ష్మయ్యనాయుడును పార్టీలో చేర్చుకుని 'కృష్ణయ్య'కు మద్దతు ఇప్పించగలిగితే..అవలీలగా ఎమ్మెల్యేగా విజయం సాధించవచ్చునని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు 'చంద్రబాబు'కు చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారంలో కూడా అదే విధమైన నివేదికలు ఉండడంతో 'బొల్లినేని'కి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబోతున్నారు. ఎంపి అభ్యర్థిగా విజయం సాధించాలంటే..వైకాపా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన టిడిపి అభ్యర్థులను రంగంలోకి దించితేనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మెజార్టీ నాయకుల అభిప్రాయంతో పాటు పార్టీ పరిశీలకులు ఇఛ్చిన నివేదికలను, ఇతర మార్గాల ద్వారా సేకరించిన సమాచారం అంతా ఒకే విధంగా ఉండడంతో..'బొల్లినేని'ని ఆత్మకూరు టిడిపి అభ్యర్థిగా ప్రకటించడం ఖాయమని స్పష్టమైంది. నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే 'కొమ్మి'కి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెబితే ఆయన మనస్ఫూర్తిగా పనిచేస్తారని, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే సుందరరామిరెడ్డి కుమారుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి 'జగన్‌' విలువ ఇవ్వకపోవడంతో ఆయన ఆ పార్టీని వీడే అవకాశం అందని..ఆయన రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇవ్వగలిగితే పార్టీలో చేరతారని కొందరు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 'బొమ్మిరెడ్డి' తండ్రి సుందరరామిరెడ్డి 'ఆత్మకూరు' నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించిన విషయం విదితమే. ఆత్మకూరులో వైకాపా అభ్యర్థిగా మేకపాటి కుటుంబసభ్యులు పోటీ చేసినా..మాజీమంత్రి ఆనం పోటీ చేసినా టిడిపి అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్యను బరిలోకి దింపితే విజయం సాధించడం ఖాయమని అటు టిడిపి నాయకులు, ఇటు వైకాపా నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.

(191)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ