WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నరేంద్ర'కు 'బాబు' షాక్‌ ఇస్తారా..!?

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు విజయం సాధించి ఆరవ సారి కూడా విజయంసాధించి డబుల్‌హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక నాయకునిగా చరిత్రలో నిలిచిపోవాలని కలలు కంటున్న 'ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌'కు చంద్రబాబు త్వరలో షాక్‌ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంఘం డైరీ ఛైర్మన్‌ పదవి కావాలా..? లేక ఎమ్మెల్యేగా టిక్కెట్‌ కావాలా..తేల్చుకోమని 'నరేంద్ర'కు చంద్రబాబు చెప్పబోతున్నారట. ఒక విధంగా డైరీ ఛైర్మన్‌ పదవి గుంటూరు జిల్లాలో విలువైన పోస్టే కాదు..ఆర్థిక వనరులున్న పోస్టే కాకుండా జిల్లా రైతాంగంతో సంబంధాలు ఉంటాయి. ఎమ్మెల్యే పదవీ కావాలి..సంఘం ఛైర్మన్‌ పదవీ కావాలి..మరోవైపు మంత్రి పదవి కూడా కావాలని 'నరేంద్ర' కోరుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యమని కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితులతో చెబుతూ అభ్యంతరం చెబుతున్నారు. మంత్రి పదవి రాలేదని అలబూనిన 'నరేంద్ర' సంఘం డైరీ పదవిని వదులుకుంటారని ప్రచారం జరిగినా..ఆర్థికవనరుల కల్పవల్లిని ఆయన వదులుకుంటారా..? అని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రి ఒకరు మీడియా వర్గాలతో వ్యాఖ్యానిస్తూ వాటిని ప్రచురించవద్దని కోరారు. ఆరవ సారి ఎమ్మెల్యేగా గెలిచి డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాలని ఉత్సాహంతో ఉన్న 'నరేంద్ర' సంఘం డైరీ పదవిని వదులుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నా..చంద్రబాబు నుంచి అటువంటి ప్రతిపాదనలు వస్తే..దానిపై ఏ విధంగా స్పందిస్తారో..వేచి చూడాల్సిందే.

(467)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ