WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పయ్యావుల'కు సీటు ఇస్తే..ఓడిస్తాం...!

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయం సాధించకూడదని వైకాపా నాయకులతో పాటు 'జగన్‌' కూడా కోరుకుంటున్నారట. ఈ నియోజకవర్గంలో 1999 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీ నుంచి ఎవరు విజయం సాధించారో...ఆయా పార్టీలు ప్రతిపక్షానికే పరిమితమయ్యాయనేది యధార్థం. ఇది నియోజకవర్గ సెంటిమెంటా..? లేక పోటీ చేసే అభ్యర్థి సెంటిమెంటా..? అనేది పక్కన పెడితే..నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి విజయంసాధిస్తారో..ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం ఖావడం ఖాయం. 1983,85,1994ల్లో టిడిపి అభ్యర్థులు విజయంసాధించినప్పటికీ...1989,1999,2014ల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయంసాధించారు. 1999కు ముందు జరిగిన ఎన్నికలను పక్కన పెడితే 99లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించగా..ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 2004,2009లో టిడిపి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్‌ గెలవగా..అప్పట్లో టిడిపి అధికారంలోకి రాలేకపోయింది. అప్పట్లో..పయ్యావుల సెంటిమెంట్‌పై టిడిపి నాయకులు పలు జోకులు వేసుకున్నారు. ఆయనకుసీటు ఆయన గెలిస్తే...మళ్లీ టిడిపి ప్రతిపక్షంలోకి వెళుతుందని..స్థానిక నేతలు అంటున్నారు. పదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కేశవ్‌ అప్పటి మంత్రులు రఘవీరారెడ్డి, జెసి దివాకర్‌రెడ్డిలతో సన్నిహితంగా మెలగుతూ బెంగుళూరులో భారీగా ఆస్తులు సంపాదించినట్లు అనేక సందర్బాల్లో పార్టీ నాయకులే విమర్శలు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ పదవి కావాలని పట్టుబట్టిన కేశవ్‌ ఆ పదవిని పొందారు. దానితో పాటు క్యాబినెట్‌ ర్యాంకు ఉన్న కౌన్సిల్‌ సీటును కూడా పొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా..టిడిపి అధికారంలో ఉన్నా..'పయ్యావుల'కు అన్ని విధాలుగా కలసి వస్తుందనే విమర్శలు ఉన్నాయి. మళ్లీ ఉరవకొండలో పోటీ చేస్తానని కేశవ్‌ ప్రకటించడంతో ఆ నియోజకవర్గ నాయకుల్లో ఇతర ముఖ్యుల్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కేశవ్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావించినా తాము ఎదురు తిరుగుతామని.. సెంటిమెంట్‌ను ఆయన దృష్టికి తీసుకెళతామని వారు అంటున్నారు. ఒకవేళ ఇవన్నీ పక్కనపెట్టి చంద్రబాబు పయ్యావులకు పోటీ చేసే అవకాశం ఇస్తే..ఓడిస్తామే తప్ప గెలిపించే ప్రసక్తేలేదని స్థానిక నాయకులు చెబుతున్నారు. తమకు నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపు కన్నా చంద్రబాబుమళ్లీ ముఖ్యమంత్రి కావడమే ముఖ్యమని..వారు చెబుతున్నారు. సెంటిమెంట్‌ను చంద్రబాబు పట్టించుకోకపోతున్నా...స్థానిక నేతలుమాత్రం దాన్ని గట్టిగా పట్టించుకంటున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలిపిస్తాం..పయ్యావులకు ఇస్తే ఓడిస్తాం..ఇది ఆ నియోజకవర్గ టిడిపి నాయకుల నమ్మకం.

(286)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ