WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అశోక్‌బాబు' ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..!?

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుడు 'అశోక్‌బాబు'ను టిడిపిలోకి ఆహ్వానిస్తున్న అధినేత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తారా..? లేక ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా..? అనే విషయంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్లు కావాలి...తనకు ఒంటిపై వేసుకునే కోటు తప్ప..నోట్లు కోట్లు లేవు...తాను టిడిపిలో ఎప్పుడు చేరతాననే విషయం ముందుగా అందరికీ తెలియజేస్తానని 'అశోక్‌బాబు' చెబుతున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తే..ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ భవిష్యత్‌పై ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా సమన్వయంతో పనిచేస్తానం టున్నారు 'అశోక్‌బాబు'. కాపు సామాజికవర్గానికి చెందిన 'అశోక్‌బాబు'కు చంద్రబాబు మొదటి నుంచి ప్రాముఖ్యత ఇస్తున్నారు. మంత్రులకన్నా..ఎమ్మెల్యేలకన్నా..పార్టీ నాయకుల కన్నా..'అశోక్‌'కే చంద్రబాబు ఎక్కువ విలువ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుడి హోదాలో ఉన్న నాయకుడికి ఆ విధమైన విలువ ఎందుకు ఇస్తారు. ఆయనను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయమని..పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే..ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అశోక్‌బాబు ఎవరినీ ఖాతరు చేయకుండా..ఎప్పుడూ సిఎం కార్యాలయంలో కనిపిస్తున్నారు. చంద్రబాబు లాంటి నేత ఆశీస్సులు 'అశోక్‌'కు ఉంటే ఆయన ఎవరిని ఖాతరు చేస్తారు..? ఇటీవల అమరావతి జెఎసి నాయకుడు బొప్ప‌రాజు మాట్లాడుతూ విఆర్‌ఒ ప్రమోషన్లలో 'అశోక్‌' ప్రమేయం ఉందని..ఈ విషయం తమ శాఖ చూసుకుంటుందని బాహాటంగానే విమర్శించారు. బిసి వర్గానకి చెందిన బొప్ప‌రాజు'కు అనేక మంది ఉద్యోగుల మద్దతు ఉందనేది యధార్థం. ఆయన ముఖ్యమంత్రిపై ఏ నాడూ విమర్శలు చేయలేదన్నది వాస్తవం. తాను ఉద్యోగుల సంక్షేమానికే ఎక్కువ పాటుపడతానే తప్ప..రాజకీయాలకు తాను పాల్పడలేనని..వారికి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తున్నానని చెప్పడం జరిగింది. అశోక్‌ను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వబోతున్నారని ఎవరైనా చెబితే మొట్టమొదట సంతోషించేది తానేనని..ఉద్యోగ సంఘ నేతకు ఆ విధమైన గౌరవం లభిస్తే..ఇంకేమికి కావాలని ఆయన చెబుతున్నారు. ఇటువంటి స్పల్వ విషయాలు తప్ప..చంద్రబాబు...ప్రత్యేక గౌరవం ఇస్తున్నారనేది యధార్థం. ఆయన సర్వీసు త్వరలో ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి ఉంటారా..? లేక మధ్యలోనే స్వచ్చంధ పదవీ విరమణ తీసుకుని టిడిపిలో చేరతారా..? దీనిపై అశోక్‌ ఇప్పటి వరకు పటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీలో చేరమని చంద్రబాబు ఆహ్వానించారు...దీనిపై సహ ఉద్యోగులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెబుతున్నారు.

(246)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ