WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శింగనమల'లో తల్లీ,కూతురు,కొడుకు,పిఎలదే పెత్తనం...!

అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గంలో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆధిపత్యపోరు పార్టీకి నష్టం చేకూర్తోంది. ఈ నియోజకవర్గంలో అమ్మ,కుమారుడు, కూతరు, పిఎలే పెత్తనం చేస్తున్నారని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చర్చించుంకుటున్నారు. నియోజకవర్గంలో ప్రతి పనికి ఒక రేటు, స్వంత పార్టీ నేతలైనా సొమ్ములు ఇవ్వందే పనిచేయరు. అభివృద్ధి పనుల్లో వాటాలు..ఇసుక రవాణాలో వాటాలు..తీసుకోవడం సర్వసాధారణం. వివరాల్లోకి వెళితే...అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా యామినిమాల గెలుపొందారు. ఆమె తల్లి శమంతకమణి ఎమ్మెల్సీ. సోదరుడు నియోజకవర్గ సమన్వయకర్త..పిఎ కిరణ్‌లు కలసి రాజకీయాన్ని నడిపిస్తున్నారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యుల్లో సఖ్యత లేకపోవడంతో..నాయకులు, కార్యకర్తలు మూడు వర్గాలుగా చీలిపోయారు. పనులు, సమస్యలు చక్కపెట్టుకోవాలంటే...ఆ ముగ్గురిలో ఎవరి దగ్గరకు పోతే..ఒక సమస్య...పోకుంటే మరో సమస్య. గతంలో అదృష్టం కలసి వచ్చి..యామినిబాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతకు ముందు ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవారు. నియోజకవర్గంలో మాజీమంత్రి ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమారుడు అధికారం చెలాయిస్తున్నారు. పేరుకే 'యామినీబాల' ఎమ్మెల్యే. పెత్తనమంతా ఆమె కుటుంబ సభ్యులదే. ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగున్నర సంవత్సరాల అయినా..ఆమె నియోజకవర్గంపై పట్టుసాధించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని శమంతకమణి చెబుతుండడంతో..యామినీబాల, ఆమె సోదరుడు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో..ఇప్పుడు ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గంపై పట్టుకోల్పోయాని తెలుసుకున్న యామినీబాల స్వంతంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా..అప్పటికే పరిస్థితి చేయిదాటింది. 

  జిల్లాలో ఏ నియోజకవర్గంలో కనిపించని పరిస్థితి 'శింగనమల' నియోజకవర్గంలో కనిపిస్తోంది. నలుగురు అధికారం చెలాయిస్తూ నాలుగు వర్గాలుగా చీలిపోయారు..బలంగా ఉన్న పార్టీ బలహీనపడిపోయింది...జిల్లా మంత్రులు కానీ..సీనియర్‌ నేతలు..కానీ నియోజకవర్గంపై దృష్టిపెట్టలేదు. జరుగుతున్న విషయాలను చంద్రబాబు దృష్టికి ఎవరూ తీసుకెళ్లలేదు. అవలీలగా పార్టీ విజయం సాధించే శింగనమలలో పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటికైనా సీనియర్‌ నేతలు..కళ్లు తెరిచి..ఆ ముగ్గురిని అదుపులో పెట్టకపోతే..పరిస్థితి చేయిదాటుతుందని స్థానిక నేతలు చెబుతున్నారు. తన నియోజకవర్గంలోనే ఇసుక దందాలు, పోస్టింగ్‌లు, బదిలీల్లో లంచాలు చేతులు మారుతున్నాయా..? మిగతా నియోజకవర్గాల్లో బాగా జరుగుతున్నాయా..? తమ కుటుంబంపై కుట్ర పన్ని దుప్రృచారం చేస్తున్నారని తల్లీ,కూతురు, కొడుకు, పిఎ రుసరుసలాడుతున్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి కుటుంబంలో చిచ్చు రేగింది. ఎమ్మెల్యేగెలిచిన యామినీబాల నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆమె సోదరుడు అశోక్‌ అన్నీ తానై వ్యవహరించారు. తల్లీ, కూతురు కన్నా కొడుకు అశోకే ముందుకు వచ్చి అన్ని పనులు చేస్తున్నారని..భవిష్యత్‌ ఎన్నికల్లో 'యామినీబాల'కు టిక్కెట్‌ ఇప్పించాలని తల్లి శమంతకమణి భావిస్తున్నట్లు బయటకు పొక్కింది. తల్లి శమంతకమణికి ఎమ్మెల్సీ ఇచ్చిన 'చంద్రబాబు' ఆఖరి నిమిషంలో కూతరు యామినీబాలకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చి గెలిపించి..అసెంబ్లీ విప్‌ పదవి ఇచ్చారని..దానికి ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చిందని స్థానిక నేతలు అంటున్నారు.

(187)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ