WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో శాఖాధిపతుల బదిలీలు...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన పూర్తి అయిన తరువాత శాఖాధిపతులను, ఐఎఎస్‌లను బదిలీ చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. పలువురు శాఖాధిపతులను భారీ స్థాయిలో మారుస్తారని తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శిగా 'పునీతా'ను నియమిస్తే...ఒక విధంగా, ఎల్‌విని నియమిస్తే..మరోవిధంగా శాఖాధిపతుల మార్పులు ఉంటాయి. ఎప్పటి నుండో బదిలీ చేయమంటున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ను, విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేయవచ్చు. ఒకవేళ వారిద్దరినీ ఇప్పుడు బదిలీ చేయకపోయినా..ఎన్నికల ముందు వారిద్దరిని బదిలీ చేయవచ్చు. అదే విధంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతంను కూడా బదిలీ చేయవచ్చు. బదిలీ కోరుకుంటున్న మున్సిపల్‌శాఖాధిపతి కరికాలవళవణ్‌ కోరిక కూడా నెరవేరవచ్చు. మిగతా శాఖాధిపతులను కూడా ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేయాలనే దానిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అంది. కొన్ని జిల్లాల కలెక్టర్లపై అవినీతి ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో వారిపై వేటు వేస్తారా..? అనే విషయం బయటకు రావడం లేదు. బదిలీ కోరుకుంటున్న మరి కొంత మంది కలెక్టర్ల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటారా...? అనే విషయం బయటకు రావడం లేదు. ఏదైనా ఏమైనా సిఎం చంద్రబాబు అమెరికా పర్యటన మిగిసిన వెంటనే ప్రధాన కార్యదర్శి నియామకంపై నిర్ణయం తీసుకుని మిగతా అధికారుల బదిలీలు ఉండవచ్చు.

(474)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ