WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కాపు'ల సీట్లకు కోత పెడతానంటున్న 'జగన్‌'...!

'జనసేన', వామపక్షాలు కలసి ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి చెందిన వారికి గతంలో కేటాయించాలనుకున్న ఎమ్మెల్యే సీట్లలో భారీగా 'జగన్‌' కోత విధించబోతున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మెజార్టీ కాపులు 'జనసేన' వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ ఇతర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 'జగన్‌' ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇవన్నీ  దృష్టిలో పెట్టుకుని కాపు రిజర్వేషన్లు పరిధి కేంద్రంలో ఉందని తెలివిగా తప్పుకున్నారు. ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో మాట మార్చారు.2009లో ప్రజారాజ్యం పార్టీకి పోలైన ఓట్లను ఆయన పరిశీలిస్తూ..ఇతర వర్గాలకు చెందిన ఓటర్లపై ఆయన దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 2014లో ఓడిపోయిన అంబటి రాంబాబును తప్పించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశాలు న్నాయి. గుంటూరు జిల్లాలో గతంలో 'రెడ్డి' సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చామని..ఈసారి ఒకటీ రెండు కోత పెట్టాలని 'జగన్‌' భావించినా..తాజా పరిస్థితుల్లో మరో రెండు సీట్లు ఎక్కువ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాపు సామాజికవర్గానికి కోత విధించి...బీసీ వర్గాలతో పాటు ఇతర వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని 'జగన్‌' నిర్ణయించుకున్న నేపథ్యంలో 'అంబటి' మాత్రమే ఆ పార్టీలో ఉన్నారని మిగతా వారంతా 'జనసేన'లో చేరిపోతున్నారు. నాలుగేళ్లలో 'చంద్రబాబు' కాపు కార్పొరేషన్‌కు భారీగా నిధులు ఇఛ్చారు.. అసెంబ్లీలో రిజర్వేషన్‌ కోసం బిల్లు పాస్‌ చేసి కేంద్రానికి పంపారు..కానీ..ఆ సామాజికవర్గం 'పవన్‌'వైపే ఉందని..ఇంత చేసిన... 'చంద్రబాబు'నే వారు పట్టించుకోవడం లేదని, ఏమీ చేయని...'జగన్‌'ను వారెందుకు పట్టించుకుంటారని...దీంతో..ఇతర వర్గాలను ఆకట్టుకోవాలని 'జగన్‌' ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గించి..ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత పెంచే నిర్ణయం సత్ఫలితాలు ఇస్తాయా..? లేదా...కాపుసామాజికవర్గం వ్యతిరేకత పూర్తిగా నష్టం చేకూరుస్తుందేమో చూడాలి.

(207)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ