WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' వస్తే మూడు రాజధానులు..!

తాను అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే రాజధాని అమరావతిపై దృష్టి పెడతానని.. ప్రతిపక్షనేత వై.ఎస్‌ జగన్‌ చెబుతున్నారట. రాజధానిని అమరావతిలో నిర్మించడం ఇష్టం లేని ఆయన దాన్ని మార్చేందుకు పలు ప్రతిపాదనలు ముందు పెట్టాలని ఆలోచిస్తున్నారట. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న రాజధానిని అక్కడే ఉంచుతారట. రాజధాని కోసం టిడిపి ప్రభుత్వం సేకరించిన వేలాది ఎకరాల్లో కొంత మాత్రమే ఉంచుకుని మిగతా భూమిని రైతులకు మళ్లీ ఇచ్చేస్తామని చెప్పబోతున్నారట. దీనితో రాజధాని ప్రాంతాన్ని కుదించాలనే ప్రతిపాదనను ఆయన ఆలోచిస్తున్నారని అంటున్నారు. రాజధానిలో భూములు ఇవ్వని రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఆలోచిస్తున్నారట. అంతే కాదు..ప్రస్తుతం ఉన్న తాత్కాలిక భవనాలను కొనసాగిస్తూ నూతన నిర్మాణాలను చేపట్ట కూడదని భావిస్తున్నారట. అదే సమయంలో రాష్ట్రానికి మరో మూడు ప్రాంతాల్లో రాజధాని నగరాలను నిర్మించాలని ఆలోచిస్తున్నారట. ఆయన ఆలోచన ప్రకారం విశాఖపట్నం, కర్నూలులను రాష్ట్రానికి రెండో, మూడో రాజధానులుగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద..అమరావతిని కొనసాగిస్తూనే మరో రెండు నగరాలను రాజధాని పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ ప్రతిపాదనపై ప్రజలేమంటారో చూడాలి మరి.

(464)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ