WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెవిపి'ని 'చంద్రబాబు' ఎందుకు వదిలేశారు...!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రత్యర్థులపై చూపిస్తోన్న మొహమాటం ఆయనకే నష్టాన్ని చేకూరుస్తోంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను వేధించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై ఆయన చూసీ చూడనట్లువ వ్యవహరిస్తుండడంతో వారు రెచ్చిపోయి...ఆయనకు మళ్లీ నష్టాన్ని చేకూర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. చిన్న అవకాశం వచ్చినా...'బాబు'పై బురద చల్లడానికి, అసత్య ప్రచారాలు చేయడానికి ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వై.ఎస్‌.ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టి నప్పుడు..అంతా తానై...వేల కోట్లు దోచిపెట్టిన ఆయన 'ఆత్మ' కెవిపి రామచంద్రరావు ఇప్పుడు 'చంద్రబాబు'పై అసత్య ప్రచారం చేయడంలో ముందుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఘనత మొత్తం దివంగత వై.ఎస్‌దేనని..ఆయన నిన్న విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సమావేశంలో ఒక డాక్యుమెంట్‌ ప్రజెంటేషన్‌ చేయడం, దానికి మాజీ మంత్రి రామచంద్రరావు, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు మరి కొందరు 'బాబు' వ్యతిరేకులు మద్దతుగా మాట్లాడడం కాంగ్రెస్‌ నేతలనే విస్మయానికి గురిచేసింది. పోలవరం ప్రాజెక్టును నిర్మించకుండా...కాల్వలు తవ్వి అడ్డగోలుగా దోచుకున్న వై.ఎస్‌ ఆయన పుత్రరత్నం.. పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన కృషి ఏమిటని వారిలో వారే ప్రశ్నించుకున్నారట. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌వేన కూడా నిర్మించకుండా..కాల్వలు తవ్వితే ఉపయోగం ఏమిటి..? పోలవరం ప్రాజెక్టు వై.ఎస్‌ హయాంలోనే పూర్తి అయిందని చెబుతున్న కెవిపి తదితరులు...ఇప్పుడు ప్రాజెక్టు వేగంగా నిర్మించడం లేదని ఎందుకు విమర్శలు చేస్తున్నారు. వై.ఎస్‌.పోలవరం కడితే..మొన్న 'సాక్షి' పత్రికలో ఇప్పుడు పునాదులే వేశారని బ్యానర్‌ ఐటమ్‌ ఎందుకు ప్రచురించారు. పోలవరం వై.ఎస్‌ నిర్మిస్తే..ఇప్పుడు 'బాబు' పునాదులు వేయాల్సిన అవసరం ఏముంది? కట్టిన ప్రాజెక్టుకు పునాదులు మళ్లీ వేశారా..? ఇవేం విమర్శలు అన్న మాట స్వంత పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి...? ఒకవైపు తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకోవాలని స్వయానా..కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' చెబుతుంటే..పొత్తులకు తూట్లు పొడిచే మాటలు కెవిపి ఎందుకు మాట్లాడుతున్నారు..?

  ఇది ఇలా ఉంటే...వై.ఎస్‌ హయాంలో వేల కోట్లు దిగమింగిన 'కెవిపి'పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు. నాడు వై.ఎస్‌ సిఎంగా ఉన్న సమయంలో ప్రతి పనిలో కమీషన్లు వసూలు చేసింది 'కెవిపి'నేన్న సంగతి జగమెరిగిన సత్యమే కదా..? మంత్రులకు శాఖలు కేటాయించడం దగ్గర నుంచి అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం వరకు అంతా 'కెవిపి' కనుసన్నల్లోనే నడిచింది కదా..? ఆ సంగతి తెలిసినా..కెవిపి అవినీతిపై ఆధారాలు ఉన్నా..ఆయనపై 'చంద్రబాబు' ఎందుకు చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్‌లో ఉన్నా..నిత్యం 'జగన్‌' ముఖ్యమంత్రి కావాలని కలవరిస్తున్న 'కెవిపి'ని 'చంద్రబాబు' ఎందుకు వదిలేశారు..? వేల కోట్ల జలవనరులశాఖ పనులు చేస్తోన్న కొన్ని సంస్థలు కెవిపి కనుసన్నల్లో కాంట్రాక్టులు చేస్తుంటే వాటికి 'చంద్రబాబు' పనులు ఇచ్చి ప్రోత్సహించిన మాట నిజం కాదా....? వై.ఎస్‌ తనయుడి సమర్థించే ఓ మెగా సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చింది కాక..వారితో మాటలు అనిపించుకోవడం 'చంద్రబాబు'కే చెల్లింది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకుని సంస్థలకు చెందిన వారు..నిత్యం ఆయనను దూషిస్తున్నా.. 'చంద్రబాబ' పట్టించుకోకపోయినా..సగటు కార్యకర్తలు మాత్రం ఈసడించుకుంటున్నారు. ఇదేమి పాలన..? అంటూ..ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాడు..వై.ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను భౌతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అంతమొందిస్తే..ఇప్పుడు అవకాశం వచ్చినా..చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నార మాట కార్యకర్తల నుంచి పార్టీ సానుభూతిపరుల నుంచి వ్యక్తం అవుతోంది. రాజకీయంగా విమర్శలు చేస్తే..అవి నిజం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు..కానీ..వ్యక్తిగతంగా కావాలని విమర్శలు చేస్తూన్న 'కెవిపి' లాంటి వారిని ఇలా వదిలివేస్తే..భవిష్యత్‌లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.

(713)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ