WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాధాకృష్ణ' రాతలెందుకు మారినయి...!?

పక్షం రోజుల క్రితం దాకా...ఆయనేమన్నారు...? తెలంగాణలో కెసిఆర్‌ను ఓడించడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదని చెప్పింది ఆయన కదా..? ఎన్నికలు ఎప్పుడు జరిగినా...టిఆర్‌ఎస్‌కు 80సీట్లు వస్తాయని బల్లగుద్ది వాదించిందీ ఆయనే...? 'కెసిఆర్‌'ను ఓడించడం మహాకూటమి వల్ల కాదని...చంద్రబాబు అనవసరంగా కెసిఆర్‌తో గెలుక్కుంటున్నాడని...అలా చేయవద్దని..అలా చేస్తే..ఆంధ్రా ఎన్నికల్లో కెసిఆర్‌ వేలు పెట్టి టిడిపికి నష్టం కల్గిస్తాడని రాసిందీ ఆయనే. తెలంగాణ ప్రజలంతా..కెసిఆర్‌ వెనుకే ఉన్నారని...ఎన్నికల్లో ఆయన గెలుపు తథ్యమని చెప్పిన 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ ఒక్కసారిగా పల్లవి మార్చేశాడు..? పక్షం రోజుల కిందట చెప్పిన మాటను ఇప్పుడు గట్టిగా చెప్పలేకపోతున్నాడు..? ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గట్టి పోటీనీ ఎదుర్కొంటుందని...కెసిఆర్‌ టిడిపితో పొత్తు పెట్టుకుంటే బాగుండేదని..ఇప్పుడు మాట మార్చాడు. పదిహాను రోజుల క్రితం నాడు టిడిపితో పొత్తు లేకపోయినా..టిఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెప్పిన 'రాధాకృష్ణ' ఇప్పుడు కెసిఆర్‌ గెలుపు అంత సులువు కాదని..తన కాలమ్‌లో రాసుకుంటున్నారు. 

 80 స్థానాలు వస్తాయని బల్లగుద్దిన 'రాధాకృష్ణ' ఇప్పుడు బొటా బొటి మెజార్టీతో అయినా కెసిఆర్‌ గెలుస్తాడని.. అంటున్నాడు..కానీ..ఆయనలో మాత్రం ఇప్పుడు ఓటమి భయం మొదలైనట్లుంది. అంతే కాకుండా మీడియాకు ఉన్న కొన్ని పరిమితుల వల్ల...తెలంగాణలో జరుగుతున్న విషయాలు బయటకు రావడం లేదని..సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దమ్మున్న ఛానెల్‌ అని చెప్పుకున్న 'రాధాకృష్ణ' ఇప్పుడు పరిమితుల గురించి మాట్లాడడమేమిటో...? ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోకుండా... కెసిఆర్‌ అండ్‌ కో ఇచ్చిన సర్వేతో రెచ్చిపోయిన 'రాధాకృష్ణ' అసలైన వాస్తవాలను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నట్లున్నారు. అందుకే.. తన కాలమ్‌లో ఇప్పుడు...కెసిఆర్‌ గెలుపు అంత ఈజీ కాదని చెప్పుకుంటున్నారు. టిడిపి,కాంగ్రెస్‌, సిపిఐ పార్టీల కూటమి...కెసిఆర్‌ను ఓడించే పరిస్థితి ఉండడంతోనే తన రాతలను 'రాధాకృష్ణ' మార్చకున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అదే సమయంలో నాలుగున్నరేళ్ల కెసిఆర్‌ పాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో....కూడా అర్థమయ్యే 'రాధకృష్ణ' తన రాతలను మార్చుకున్నట్లుంది. ఏది ఏమైనా సత్యాన్ని 'రాధాకృష్ణ' తొందరగానే గ్రహించారని మీడియా వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

(2916)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ