WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 'అనిల్‌చంద్రపునీతా'

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 'అనిల్‌చంద్రపునీతా'ను ప్రభుత్వం నియమించింది. 1984 బ్యాచ్‌కు చెందిన 'పునీతా' ప్రస్తుతం సిసిఎల్‌ఎగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 'దినేష్‌కుమార్‌' ఈ రోజు రిటైర్‌ కావడంతో ఆయన స్థానంలో 'పునీతా'ను నియమిస్తారని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గతంలోనే తన కథనాల్లో ప్రచురించింది. ఆయన కంటే సీనియర్‌ అయిన 'ఎల్‌వి సుబ్రహ్మణ్యం'ను కాదని 'పునీతా'ను 'సిఎస్‌'గా నియమించబోతున్నారని కూడా 'జనమ్‌ఆన్‌లైన్‌. కామ్‌' చెప్పింది. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' చెప్పిన విధంగానే..ఇప్పుడు ప్రభుత్వం 'పునీతా'ను సిఎస్‌గా నియమించింది. (పునీతా సిఎస్ కాబోతున్నారంటూ 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' చెప్పినకథ‌నాలు ఇక్క‌డ చ‌ద‌వండి)(http://www.janamonline.com/article?nid=4946) (http://www.janamonline.com/article?nid=4919) (http://www.janamonline.com/article?nid=4918) 'పునీతా' కంటే 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం' ప్రీతీ సూడాన్‌లు సీనియర్లు. వీరిద్దరూ 1983 బ్యాచ్‌కు చెందిన వారు. కాగా..'సూడాన్‌' భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 'ఎల్‌వి' అంటే మొదటి నుంచి విముఖంగా ఉన్న 'చంద్రబాబు' వారిద్దరినీ కాదని...'పునీతా'కు పట్టం కట్టారు. తాను చెప్పినట్లు వింటారనే భావనతోనే 'పునీతా'ను 'చంద్రబాబు' సిఎస్‌గా నియమించారని తెలుస్తోంది. కాగా..'పునీతా' కంటే జూనియర్లు అయిన సిఎంఒ కార్యాలయ కార్యదర్శి 'సతీష్‌చంద్ర', రెవిన్యూశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, ఎక్సైజ్‌శాఖాధిపతి డాక్టర్‌ సాంబశివరావులు రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే...వీరందరిని కాదని..'పునీతా'ను 'చంద్రబాబు' సిఎస్‌గా నియమించుకున్నారు. ఆయన మరో తొమ్మిది మాసాల పాటు సిఎస్‌గా కొనసాగనున్నారు. 'పునీతా' సర్వీసు వచ్చే ఏడాది మే మాసాంతానికి ముగియనుంది.

(259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ