WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎల్‌వి'కి 'చంద్రబాబు' అన్యాయం చేశారని బ్రాహ్మణులు భావిస్తున్నారా...?

నిజాయితీపరుడు, సమర్థుడు,సర్వీసులో మచ్చలేని అధికారిగా పేరు తెచ్చుకున్న బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించకపోవడంపై సిఎం చంద్రబాబు తప్పిదం చేశారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే బ్రాహ్మణ వర్గాన్ని టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మాజీ సిఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసినట్లుగా కనిపిస్తోంది. సీనియార్టీతో పాటు, సిన్సియార్టీ, తెలుగు ఐఎఎస్‌ అధికారిగా పేరున్న 'ఎల్‌.వి' సుబ్రహ్మణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు దూరం పెట్టడం వెనుక ఏ కారణాలున్నాయో...ఆయనపై అభియోగాలున్నాయో.. లేదో...చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని..ఐవైఆర్‌ నిలదీయబోతున్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు బ్రాహ్మణ సామాజికవర్గం టిడిపికే మద్దతు ఇస్తోందన్న సంగతి ఐవైఆర్‌కు తెలుసు. ఆయన చేతికి బ్రహ్మశిరోమణి అనే కత్తిని చంద్రబాబు అందించారని ఐవైఆర్‌ భావిస్తున్నారట. తన కన్నా జూనియర్‌ అయిన వ్యక్తి సిఎస్‌ అయితే..ఎల్‌వి ఎలా బాధ్యతలు నిర్వహిస్తారు...? ఒకప్పుడు ఎల్‌వి కలెక్టర్‌గా ఉన్నప్పుడు 'పునీతా' సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన వద్ద 'ఎల్‌వి' ఎలా పనిచేస్తారు..? సమర్థులు, నిజాయితీపరుల సేవలను వాడుకుంటున్నానని చెప్పుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు...? 'పునీతా'కు సిఎస్‌ పదవి ఇచ్చినా...ఇవ్వకపోయినా..ఎవరూ పట్టించుకోరు..? ఆయన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారేనని పాలకులు నచ్చచెప్పాలని భావించినా..ఉత్తారాది వారికి తెలుగు బ్రాహ్మణులకు చాలా తేడా ఉంది. ఉత్తరాది బ్రాహ్మణులు రాజకీయంగా చురుగ్గా ఉంటారు...దక్షిణాధి బ్రాహ్మణులు అంత చురుగ్గా ఉండరు. ఇప్పటికే పలు జిల్లాలు పర్యటించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారిని పిలిపించుకుని వారితో రహస్యంగా చర్చించారు. కానీ చాలా మంది టిడిపికి వ్యతిరేకంగా ముందుకు వచ్చేందుకు అంగీకరించలేదు. తాజాగా...ఎల్‌వికి అన్యాయం జరిగింది...సిఎం చంద్రబాబు కావాలని ఆయనను పక్కన పెట్టారు..కేవలం..ఇది కులపరమైన వివక్షేనని ఐవైఆర్‌ ప్రచారం చేసే అవకాశం ఉంది. పలువురు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు కానీ...సచివాలయంలో పనిచేస్తోన్న ఉద్యోగులు కానీ...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఎల్‌వికి దక్కితే బాగుంటుందని భావించారు. కానీ వారు అనుకున్నదొక్కటి అయినదొక్కటి. ఒకవేళ ఐవైఆర్‌ కృష్ణారావును రెచ్చగొడితే పరిస్థితి ఏమిటి..? దానిని ముఖ్యమంత్రి ఎలా తిప్పికొడతారు..? ఏ విధంగా ప్రతిస్పందించబోతున్నారు..? వేచి చూడాల్సిందే...!

 (బి.ఆర్‌.కె.మూర్తి)

(308)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ