WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వంగవీటి' మీకు దేవుడా...? 'చింతమనేని' రౌడీనా..'పవన్‌' గారూ...!?

విజయవాడ నగరంలో రెండు వర్గాల మధ్య జరిగిన హత్యలు, కొట్లాటలను కులపరమైన ఘర్షణలుగా చిత్రీకరించి...రెండు సామాజికవర్గాలపై రౌడీ షీటర్లని పోలీసులు కేసులు ఫైళ్లు చేశారే తప్ప..కులపరంగా రౌడీ షీట్లు ఓపెన్‌ చేయలేదని అందరికీ తెలుసు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై 33 కేసులు ఉన్నాయని...'జనసేనాధిపతి' పవన్‌ చేసిన విమర్శలకు ధీటుగా స్పందించిన 'చింతమనేని' మూడు కేసులకు మించి అదనపు కేసులు తనపై ఉంటే..రాజకీయాల నుంచి శాశ్వితంగా వైదొలుగుతానని బాహాటంగా సవాల్‌ విసిరారు. శంఖులో నీరు పోస్తే..తీర్థమన్న సంగతి వలే..మీ సామాజికవర్గానికి చెందిన 'వంగవీటి' దేవుడా..? ఆయనను హత్య చేసినప్పుడు జరిగిన గొడవలు తప్పని వ్యాఖ్యానించిన 'పవన్‌' ఇప్పుడు ఆయనేమో.. దేవుడు..? చింతమనేని రౌడీ...అంటూ వ్యాఖ్యలు చేయడం ఏమిటి..? దేవినేని మురళి, గాంధీ హత్యల వెనుక రంగా హస్తం లేదా..? ఆ రెండు వర్గాలు పరస్పరం చంపుకున్న సంగతి పవన్‌కు తెలియదా..? కులపరమైన అభిమానంతో 'వంగవీటి'పై స్పందించిన 'పవన్‌' రాజకీయ లబ్దికోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా 'చింతమనేని'పై పోలీసు స్టేషన్‌లో నమోదు కాని కేసులు లేవనెత్తుత్తూ రౌడీ ముద్ర వేస్తూ..కులపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని...ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు..భావిస్తున్నారు. ఆయనను రౌడీ అని ముద్ర వేయడాన్ని 'పవన్‌' సామాజికవర్గ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. 'చింతమనేని'పై పవన్‌ చేసిన వ్యాఖ్యలు అర్హరహితమని, వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్‌ పెట్టుకుని..వ్యాఖ్యలు చేశారని 'జనసేన' నాయకులు ఆప్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ఒక కథనంలో ఏముందంటే...సీనియర్‌ పాత్రికేయుడు...ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి వెళ్లారు..ఎప్పుడు ఉదయం ఆరు గంటలకే నిద్ర లేచి వాకింగ్‌తో దినచర్య ప్రారంభించిన 'చింతమనేని' ఆరోజు పదిగంటల వరకు పనుకునే ఉన్నారట. ఇదే విషయాన్ని పాత్రికేయుడుకు చెబుతూ..లోపలికి ఎవరీని రానియవద్దని చెప్పినా కూడా...ఆయనకు ఉన్న చనవుతో 'చింతమనేని' ఉన్న ప్రదేశంలోకి వెళ్లడం జరిగింది...? అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి..ఆ పాత్రికేయడు కంగుతిన్నారు. 'చింతమనేని' గజగజవణికిపోతూ భయపడుతున్నట్లుగా పోజులు కనిపించారు. మీరు ఎంతో ధైర్యం కలవాళ్లు..ప్రతివిషయాన్ని బాహాటంగా చెబుతుంటారు..? ఎవరికి భయపడరని పేరుంది..మీరెందుకు ఈ విధంగా వణికిపోతు న్నారని..ఆ పాత్రికేయుడు..చింతమనేనిని ప్రశ్నించారు..? జనసేన సైనికులు ఎప్పుడు వచ్చిన నాకాళ్లు విరగొడతారో..నల్లిని నలిపినట్లు నలిపేస్తారా..? మీసం లేని కుర్రాడు నన్ను ఓడిస్తాడేమో..అని భయపడుతూ ఇంట్లో ఉన్నాను..ఒకవేళ బయటకు వెళదామంటే...గేదెలు,ఎద్దులను నాపైకి ఎవరైనా ఉసిగొల్పి పొడిపిస్తారేమో..అని భయంగా ఉంది. అందుకే పగలు బయటకు రాకుండా నిద్రలోనే ఉండిపోయానని చెప్పారట. ఎందుకైనా మంచిదని ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు బౌన్సర్లు కూడా వచ్చిన తరువాత..బయటకు వస్తానని చింతమనేని వివరించడంతో ఖంగుతిన్న పాత్రికేయుడు..ఏమిటిసార్‌..ఇలా మాట్లాడు తున్నారు..చింతమనేని భయపడతారా..? మీరు ఈ విధంగా మాట్లాడితే...నాకు పెద్ద కామెడీగా కనిపిస్తుందని చెప్పారట. ఇదేమిటి..? నిన్న దెందులూరు నియోజకవర్గ పరిధిలో పవన్‌ ప్రసంగిస్తూ..పెద్ద కామెడీ చేస్తూ విమర్శలు, ఆరోపణలు చేశారు..మీరు నమ్మారో లేదో తెలియదు..చాలా మంది నమ్మింటారు..కామెడీలు చేసే అవకాశం ఆయనకే కాదు..నాకు కూడా వచ్చిందయ్యా..అందుకే ఈ కామెడీ నేను చేశాను..అని చెప్పడంతో..ఆ జర్నలిస్టు మెదలకుండా ఉండిపోయారు. దెందులూరు నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంలో విపరీతమైన పలుకుబడి ఉన్నమాట యధార్థమే. నేను...పవన్‌ గాలిలో గెలవలేదు..2009 ఎన్నికల్లోనే విజయం సాధించాను...? పవన్‌ మా పార్టీకి మద్దతు ఇవ్వక ముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీకి 28వేలు మెజార్టీ వచ్చింది...ఆయనతో పాటు బిజెపి మద్దతు తెలిపాక మెజార్టీ 17వేలకు పడిపోయింది..? నేను టిడిపి గుర్తుపై చంద్రబాబు ఆశీస్సులతో సైకిల్‌ గుర్తుతో గెలిచానే తప్ప..మిగతా వారి ప్రచారంతో కాదని..చింతమనేని చెప్పడం పవన్‌కళ్యాణ్‌ అహాన్ని దెబ్బతీసింది. అందుకేనేమో..స్వంత అన్నను గెలిపించుకోలేని మనిషి నాయకుడు నన్నేమి గెలిపిస్తాడని..వ్యంగ్యంగా అన్నారు. ఇదంతా మనసులో పెట్టుకుని దెందులూరు చింతమనేని టార్గెట్‌ చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేయడం జరిగి ఉంటుందని...జనసేన సానుభూతిపరులైన ఓటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు...నేను అంత మెజార్టీతో గెలిచానంటే..మీ సామాజికవర్గ ఓటర్లతోనే అని చింతమనేని పవన్‌నునిలదీశారు. వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకుని..ఆధారాలు ఉన్న విమర్శలు చేసి..కులపరమైన మద్దతు ఉన్న భావనతో పవన్‌ చింతమనేనిపై విమర్శలు చేసి ఉంటారని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోకుండా..చింతమనేని వ్యతిరేకులైన స్థానిక వైకాపా నేతలు ఇచ్చిన విమర్శలను పవన్‌ చదివారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ముందు వంగవీటి రంగాను ప్రశంసలతో ముంచెత్తిన పవన్‌ ఆయనపై ఉన్న హత్య కేసులు, కిడ్నాప్‌లు, భూ ఆక్రమణ కేసుల విషయం తెలియదా..? వీరిని వారు...వారిని వీరు చంపుకుంటే కులపరమైన వివాదంగా మారినవిషయం పవన్‌కు తెలుసు..? వంగవీటి మోహన్‌రంగా ఆయన దృష్టిలో దేవుడు..కేవలం రెండు మూడు కేసులు మాత్రమే నమోదు అయిన 'చింతమనేని' దెయ్యమా..? అని ప్రభాకర్‌ అనుచరులు నిలదీస్తున్నారు. ఏది ఏమైనా..పవన్‌ విమర్శలు ఆయన స్థాయికి తగవని, రాష్ట్రస్థాయి నాయకుడు దెందులూరుకే పరిమితం చేసి ప్రతిష్టను పోగొట్టుకున్నారని పలు రాజకీయ పార్టీల నేతలు చర్చావేదికలపై అభిప్రాయపడుతున్నారు. దీనిని సమర్థించలేక, ఎదుర్కోలేక...ఆయా చర్చా వేదికలకు హాజరైన జనసేన తరుపు నాయకులు ఎదురుదాడితో పక్కదోవ పట్టించడంలో విఫలమయ్యారు. 

(బి.ఆర్‌.కె.మూర్తి)

(359)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ