WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎల్‌వి'కి ప్రాధాన్యత ఇస్తానంటున్న 'సిఎం'...!

ఇంతకు ముందు సిఎస్‌గా నెల రోజులు బాధ్యతలు నిర్వహించిన అజయ్‌కల్లం ఆయన తరువాత సిఎస్‌గా బాధ్యతలు నిర్వహించిన 'దినేష్‌కుమార్‌' కన్నా సీనియర్‌ అయిన 'ఎల్‌వి'ని సిఎస్‌గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినా..ఆఖరి నిమిషంలో ఆయన 'పునీతా' వైపు మొగ్గుచూపినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు 'ఎల్‌వి'ని ప్రభుత్వం అవమానించిందని, ఇప్పుడు మరోసారి అవమానించడం తగదని..కొందరు సూచించడంతో...ఆయన ఎల్‌విని పిలిపించి సముచిత స్థానాన్ని కల్పిస్తామని, 'పునీతా'కు మరో తొమ్మిది నెలలు మాత్రమే పదవీ కాలం ఉందని, ఆయన రిటైర్‌ అయిన తరువాత నీకే అవకాశం ఇస్తానని తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిని తాను కలిసిన మాట యధార్థమేనని..అక్కడ ఏం జరిగిందో అన్న విషయం బయటపెట్టనని...ఎల్‌వి చెబుతున్నారు. ఆయనను రెవిన్యూశాఖతో పాటు దేవాదాయశాఖాధిపతిగా కానీ..లేక ప్రస్తుతం డి.సాంబశివరావు నిర్వహిస్తున్న ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌శాఖాధిపతిగా కానీ నియమించే అవకాశాలు ఉన్నాయి. తన మనసులో మాటను ముఖ్యమంత్రి దృష్టికి ఎల్‌వి తీసుకెళ్లలేదని తెలిసింది. అక్టోబర్‌ మొదటి వారంలో జరగనున్న బదిలీల్లో ఎల్‌వికి అగ్రతాంబూలం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

  శాఖాధిపతుల్లో ఎవరెవరిని బదిలీ చేస్తారో అన్న విషయం బయటకు తెలియకపోయినా..ఎల్‌వి విషయంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే తెలుగేతర అధికారులకు ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని రిటైర్‌ ఐఎఎస్‌ అధికారులు విమర్శిస్తున్న నేపథ్యంలో 'ఎల్‌వి'కు ప్రాముఖ్యతనిచ్చి..ప్రాధాన్యత శాఖలకు అధిపతిగా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 3వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆ తరువాత రోజుల్లో అధికారుల బదిలీలు జరగడం ఖాయమని సిఎంఒ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌వికి ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇచ్చి..మిగతా శాఖాధిపతులను యధావిధంగా కొనసాగిస్తారా..? లేక కొన్ని శాఖాధిపతులను మార్చి...జిల్లాలకు చెందిన కలెక్టర్లల్లో కొందరిని బదిలీ చేస్తారా..? ముందుగా ముగ్గురు ఎస్పీలను, ఐదుగురు ఐజీలను బదిలీ చేయాలని సిఎం నిర్ణయానికి వచ్చారు.  గుంటూరు రేంజ్‌ ఐజి, గుంటూరు గ్రామీణ ఎస్పీ, నెల్లూరు ఎస్పీతో పాటు మరో జిల్లా ఎస్పీ కూడా ఆ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. ఐఎఎస్‌ల్లో భారీగా మార్పులు చేస్తారా..? అనే దానిపై ఇప్పటి వరకు సమాచారం రావడం లేదు. నూతన సిఎస్‌ను నియమించడంతో ఆయన నిర్వహిస్తున్న సిసిఎల్‌ఎ పోస్టుతో పాటు విద్య,రెవిన్యూశాఖాధిపతుల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని బయటకు పొక్కింది. ఏది ఏమైనా ఎల్‌వికి ఇచ్చే పోస్టును బట్టి మిగతావి ముడిపడి ఉన్నాయని స్పష్టం అవుతోంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఈ ప్రక్రియను ముగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ