WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోటీకి వెనకడుగేస్తున్న సినీనటుడు 'సుమన్‌'...!

ఎన్నికల్లో పోటీ చేసేవారు రూ.50కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటే రండి...25కోట్లు డిపాజిట్లు చేసి..పేపర్లు తీసుకురండి..అని వైకాపా అధినేత 'జగన్‌' నిబంధన పెట్టడంతో...అంత కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండి...నామినేటెడ్‌పోస్టు తీసుకుని..ఎన్నికల్లో ప్రచారం చేయాలని సినీనటుడు 'సుమన్‌' నిర్ణయం తీసుకున్నారట. నిన్నా మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన 'సుమన్‌'కు తాజా పరిస్థితులు కలవరాన్ని గురి చేస్తున్నాయి. స్వంత సొమ్మును ఖర్చు పెట్టుకోవాలంటే కష్టం కనుక...పార్టీకి ప్రచారం చేసి..సిఎం నామినేటెడ్‌ పదవి తీసుకుని...ప్రచారం చేస్తానని 'సుమన్‌' చెబుతున్నారట. ఆయన గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుండి...ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. తాజాగా ఆయన మనస్సు మార్చుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కులం సంగతి దేవుడెరుగు..కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఈ విధంగా ఖర్చు పెట్టడం ఎందుకు..? అని ఆయన వెనక్కు తగ్గుతున్నారట. ఒకవేళ పూర్తి ఖర్చు 'చంద్రబాబు' భరిస్తానంటే...'సుమన్‌' అంగీకరించే అవకాశాలు ఉన్నాయి..స్వంత సొమ్ములు ఖర్చు పెట్టి...ఆయన పోటీ చేయరని పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు చెబుతున్నారు. దీనిని బట్టి సినీరంగం నుంచి ఏ వ్యక్తి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరట. ఓటర్ల గొంతెమ్మ కోర్కెలు, కార్యకర్తల డిమాండ్‌లను చూసిన సినీపరిశ్రమకు చెందిన వ్యక్తులు రాజకీయాల వైపు వచ్చేందుకు జంకుతున్నారు. 2014లో వైకాపా అభ్యర్థిగాపోటీ స్వంత తమ్ముడిని రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న పూరీ జగన్నాధ్‌ మళ్లీ రంగంలోకి దిగేందుకు ససేమిరా అంటున్నారు. ఒకసారి ఎంపీగా విజయం సాధించి మరో సారి ఓడిపోయిన మురళీమోహన్‌ మరోసారి పోటీ చేసేందుకు వెనకంజవేస్తున్నారు. ఏది ఏమైనా...సినీరంగానికి చెందిన వారెవరూ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు.

(188)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ