WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎస్‌ పోస్టును 'సతీష్‌' ఎందుకు వద్దనుకున్నారో...?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక సందర్భంలో సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న 'సతీష్‌చంద్ర'ను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఆ పోస్టు కోసం ఆయన కూడా తాపత్రయపడ్డారని చర్చ కూడా జరిగింది. చివరకు ఆయన ఎందుకు వెనకడుగు వేసి ఉంటారనే దానిపై సచివాలయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో సిఎస్‌గా తాను పదవిలో ఉంటే...విపక్షాలకు చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సిఎంఒ కార్యాలయంలో పనిచేసిన అధికారి సిఎస్‌గా ఉంటే పక్షపాతంతో ఎన్నికలు నిర్వహిస్తారని ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సిఎంఒ కార్యాలయ ఇన్‌చార్జిగా అధికారాలన్నీ చలాయిస్తున్న 'సతీష్‌'కు సిఎస్‌గా చేసేదేమిటన్న ఆలోచన కలిగిందట. సిఎస్‌గా ఎవరు ఉన్నా..రాజకీయ, ఇతరులకు సిఎస్‌తో పెద్దగా పని ఉండదు. ముఖ్యమంత్రి, మంత్రులు,శాఖాధిపతి స్వంత నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితుల్లో సిఎస్‌గా పెద్దగా ఉండదు. ఈ సంగతి 'సతీష్‌'కు తెలుసు. పైగా ఎన్నికల సీజన్‌. అప్పుడు పెద్దగా పని ఉండదు. ఎన్నికల అనంతరం టిడిపి అధికారంలోకి రాకపోతే...తనను తొలగించడం ఖాయం. అందుకే సిఎంఒ కార్యాలయంలో పనిచేస్తూ..ఎన్నికల అనంతరం టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తే..ఆ పోస్టును పొందవచ్చుననే ఆలోచన ఆయనది. అందులో కూడా నిజం ఉంది. 2019 మే మాసాంతానికి 'పునీతా' రిటైర్‌ అవుతారు..కొత్త ప్రభుత్వం అదే నెలలో ఏర్పాటు కావచ్చు..లేక జూన్‌లో ఏర్పాటు కావచ్చు. ఎప్పుడు ఏర్పడినా..తాను ప్రధాన కార్యదర్శి పోస్టులోకి వెళ్లేందుకు దారులేర్పడతాయి అనేది 'సతీష్‌' ఆలోచన అని అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

  నాకు ఆ పోస్టు అసలే వద్దు..సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జిగా సంతృప్తిగా ఉన్నాను..ఇప్పుడు తాను ఉన్న పోస్టు కన్నా సిఎస్‌ పోస్టుకు ఎక్కువ అధికారాలుంటాయా..? ఇప్పటి వరకు ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులునిర్వహించి ఏం సాధించారు..అప్పటి నుండి ఇప్పటి వరకు సిఎంఒ కార్యాలయ అధికారిగా పనిచేస్తున్నాను..అధికారానికి కేంద్రంగా సిఎంఒ ఉంటుందని...ఒకవేళ సిఎస్‌గా తనను ప్రభుత్వం నియమిస్తే..ఇప్పుడు కలిసేవారెవరూ తనకు కనిపించరని... అందుకే తాను ఆ పోస్టు కోరుకోవడం లేదని...సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. సిఎస్‌కు ఎన్ని అధికారులు ఉంటాయో..లేదో కానీ..సిఎంఒ కార్యాలయానికి ఉన్న అధికారాలు మితం లేనివి. ప్రతి విషయాన్ని సిపంకు వివరించడం సిఎంఒ కార్యాలయ విధి. దాంతో..సిఎస్‌ పోస్టు కన్నా..ఇదే మిన్నగా 'సతీష్‌' భావించినట్లుంది. ఎనిమిది నెలలే కదా..ఈ మధ్య కాలంలో చేసేదేముంటుందని...'సతీష్‌' సరిపెట్టుకున్నారా..? ఏది ఏమైనా..అపార అధికారాన్ని అనుభవిస్తున్న 'సతీష్‌' ఏ పనైనా..ఆచితూచి..అడుగులు వేస్తారని తెలుసు. అందుకే తెలివిగా 'పునీతా' పేరును ముఖ్యమంత్రితో ఓకే చేపించి ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎల్‌విని సిఎస్‌ చేస్తారని హామీ ఇచ్చారు..హామీని ఆయన నెరవేర్చడం ఖాయమయితే..'సతీష్‌' మళ్లీ సిఎంఒకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ 'చంద్రబాబు' తిరిగి అధికారంలోకి రాకపోతే 'సతీష్‌'కు సిఎస్‌ అయ్యే అవకాశాలే లేవు. ఏది ఏమైనా 'సతీష్‌' తీసుకునే నిర్ణయాలను, ఇతర కారణాలను తెలుసుకుంటున్న అధికార వర్గాలు ఆయనను పరోక్షంగా అభినందిస్తున్నాయి.

(282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ