WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నమ్మినోళ్లకు 'జగన్‌' సున్నం పెడుతున్నాడా...!?

అందరూ అనుకున్నదే...! 'జగన్‌' రాజశేఖర్‌రెడ్డి టైప్‌ కాదని...? 'రాజశేఖర్‌రెడ్డి' నమ్మినోళ్లకు ప్రాణం ఇస్తాడని..వారిని ఆపదలో ఆదుకుంటాడని...సొమ్ములు లేకపోయినా..రాజకీయంగా ప్రోత్సహిస్తారనే కదా...ఇన్నాళ్లైనా..కొంత మందైనా 'ఆయన'ను తలచుకునేది...? తనను నమ్మినోళ్ల కోసం 'వై.ఎస్‌' ఎంత దూరమైనా వెళతాడు..? తనను నమ్ముకున్నోళ్లు జైలులో ఉంటే..తనకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా..జైలుకు వెళ్లి..వారిని చూసి ఓదార్చిన సంగతి రాష్ట్ర మంతా తెలిసిందే కదా...? అధికారంలోకి వచ్చిన అరగంటలోనే...తన అనుచరుడు జైలులో ఉంటే...ఆగమేఘాలపై విడిపించిన సంగతీ చూశాం..? అదే విధంగా..రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డ...ఎందరో నాయకులకు రకరకాల పనులు ఇచ్చి..వారిని నిలబెట్టిన సంగతిని ఇప్పటికీ..వై.ఎస్‌ అభిమానులు కథలు..కథలుగా చెప్పుకుంటారు...కదా..? మరి..ఆయన పుత్ర రత్నమేమిటి..? నమ్ముకున్నోళ్లకే సున్నం పెడుతున్నారని..ఆయన అనుచరులే కుమిలిపోతున్నారు. ఇటీవల వరకు..కొన్ని చోట్ల అభ్యర్థులు సరిగా లేరని..వారిని మారుస్తున్నారంటే...నిజమేనేమో..అని కొంత మంది పార్టీ నాయకులు భావించారు. కానీ..సీట్లను టోకుగా అమ్మేస్తున్న వైనం తెలిసి...అమ్మో...'జగన్మోహన్‌రెడ్డి' అంటూ పరుగులు పెడుతున్నారు. ఇన్నాళ్లూ..'జగన్‌' కోసం ఎన్ని కష్టాలనైనా ఓరిస్తే.. ఆయనేమిటి..? మమ్ములను పట్టించుకోవడం లేదంటూ..కొంత మంది నాయకులు..ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరా..ఇద్దరా.. .ప్రతి జిల్లాలోనూ..ఇదే తంతు కదా..? చిత్తూరు నుంచి మొదలై శ్రీకాకుళం వరకు ఇవే కథలు..కదా..? సొమ్ములున్నోళ్లకే టిక్కెట్లు అంటే...తొమ్మిదేళ్ల పాటు..తాము ఖర్చు చేసిన సొమ్ములు సంగతి, కష్టపడ్డ సంగతేమిటని వారు బావురమంటున్నారు. 

  తాజాగా 'జగన్‌' సున్నం పెట్టిన వారి లిస్టులో 'గుంటూరు-2' ఇన్‌ఛార్జి 'లేళ్ల అప్పిరెడ్డి' కూడా జాయినయ్యారు. గుంటూరు జిల్లాలో వై.ఎస్‌ వీరాభిమాని 'అప్పిరెడ్డి' గత ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తే..గెలవలేకపోయినా...పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ..మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తలపోశారు. కానీ...ఇప్పుడు ఇక్కడ నుంచి 'ఏసురత్నం' అనే వ్యక్తిని సమన్వయకర్తగా నియమించి..'అప్పిరెడ్డి' ఆశలపై నీళ్లు పోసేశారు. ఇక్కడే కాదు..చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి...పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న 'మర్రి రాజశేఖర్‌' ఆర్థిక పరిస్థితి సరిగా లేదని.. ఆయన గెలవలేరని చెబుతూ..సొమ్ములు తెచ్చిన 'రజినీ'కి టిక్కెట్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. కాకినాడలోనూ అదే పరిస్థితి ఉంది. అక్కడ ఎప్పటి నుంచో జగన్‌ను నమ్ముకున్న ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి కూడా టిక్కెట్‌ లేదని 'జగన్‌' తేల్చారట. దాంతో..ఆయన కిందా మీదా అవుతున్నారట. కొండపిలో ఎప్పటి నుంచో నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న 'అశోక్‌'దీ అదే పరిస్థితి. ఇప్పుడు గుంటూరు జిల్లా పెదకూరపాడు, వినుకొండ, పొన్నూరు నియోజకవర్గాల్లోనూ కొత్త వారిని తెస్తూ..పాతవారిని పక్కకు పెడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం మీద..ఎప్పటి నుంచో 'జగన్‌'ను నమ్ముకున్న వారందరినీ పక్కకు తప్పిస్తూ..సొమ్ములు వెదజల్లే వారికే టిక్కెట్లు అని పార్టీ సీనియర్‌ నాయకులు, 'జగన్‌' తేల్చి చెబుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన వాళ్లూ, సొమ్ములు వదిలించుకున్నవారు.. లబోదిబో మంటున్నారు. కాగా..'జగన్‌' వ్యవహారశైలిపై కొందరు వైకాపా నాయకులు మాట్లాడుతూ..'ఈ పిల్లగాడు..వై.ఎస్‌లా కాదు..? ఆయన నమ్మితే..ప్రాణం ఇస్తాడు...? ఈ అబ్బాయికి సొమ్ములే ముఖ్యం...' అంటూ నిట్టూర్పులుడిస్తున్నారు.

(1605)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ