WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కన్నా' కోసం..'జగన్‌' 'ఏసురత్నాని' తెచ్చారా...!?

'వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి' వ్యూహాలు లేకుండా...మొండిగా..బండగా నిర్ణయాలు తీసుకుంటారని చాలా మంది స్వంత పార్టీ నాయకులతో పాటు..ఇతర పార్టీ నాయకులు కూడా భావిస్తుంటారు. కానీ..ఆయన నిర్ణయాల్లోని లోతులు తెలియక వారు పొరపడుతుంటారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఇప్పుడిప్పుడే స్పష్టత ఇస్తోన్న 'జగన్‌' నిర్ణయాలపై స్వంత పార్టీ నాయకులతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా ఆందోళనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నా...'జగన్‌' ఒక పథకం ప్రకారమే సీట్లు కేటాయిస్తున్నారని..ముందస్తు కుమ్మక్కులు...లోపాయకార ఒప్పందాల మేరకే...ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేదానిపై ఆయన స్పష్టత ఇస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. నిన్నా..ఈ రోజు...గుంటూరు-2 అభ్యర్థి ఎంపికపై అటు పార్టీలోనూ..ఇటు ఇతర వర్గాల్లోనూ తీవ్ర స్థాయిలో కలకలం రేగిన సంగతి తెలిసిందే కదా..? గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 'లేళ్ల అప్పిరెడ్డి'ని కాదని...'ఏసురత్నం' అనే అభ్యర్థిని ఇన్‌ఛార్జిగా ప్రకటించారని...ఆయన మొండిగా సొమ్ముల కోసం ఇలా చేశారని చాలా మంది విమర్శించారు. కానీ..ఇక్కడ సొమ్ములు, ఇతర వ్యూహాల ప్రకారమే...'జగన్‌' అభ్యర్థిని ప్రకటించారని వారు చెబుతున్నారు.

  నిన్న గుంటూరు-2 ఇన్‌ఛార్జిగా 'ఏసురత్నాని' ప్రకటించినప్పుడు...స్వంత పార్టీ నేతలే..ఎవరీ..'ఏసురత్నం' అంటూ ప్రశ్నార్థకంగా మొహాలు పెట్టారు. పైగా..ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్న 'అప్పిరెడ్డి'ని కాదని ముక్కూ మొహం తెలియని వ్యక్తిని ఇక్కడ నుంచి పోటీకి పెడతారా..? ఇదేం పద్దతంటూ...ఆడిపోసుకున్నారు. 'లేళ్ల అప్పిరెడ్డి' వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భక్తుడని, అదే విధంగా 'జగన్‌'కు కూడా విశ్వాసంగా ఉన్న వ్యక్తికి అన్యాయం చేస్తున్నారని..చాలా మంది విమర్శించారు. కానీ...'జగన్‌' అలా ఎందుకు చేశాడో..చాలా మందికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆయన ఎందుకు ఈ విధంగా చేశారో వివరంగా తెలుసుకుందాం..!

  ఆ మధ్య  ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 'కన్నా లక్ష్మీనారాయణ' తాను బిజెపికి రాజీనామా చేసి వైకాపాలో చేరుతున్నానని హడావుడి చేశారు గుర్తుందా..? వైకాపాలో చేరేందుకు అన్నీ సిద్దం చేసుకుని గుంటూరు నగరం మొత్తం పోస్టర్లతో నింపేసారు కదా..? నేడు గడిస్తే..రేపు ఉదయం వెళ్లి...'కన్నా' 'జగన్‌'ను కలసి వైకాపాలో చేరడమే మిగిలింది. కానీ..ఏమి జరిగింది.. 'కన్నా'కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది..హడావుడిగా..హాస్పటల్‌లో చేరిపోయారు...? గుండెపోటు రావడంతో వైకాపాలో చేరడం ఆగిపోయిందని..అధికారికంగా ప్రకటించారు. కానీ...బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా' 'జగన్‌'కు ఫోన్‌ చేసి..'కన్నా'ను పార్టీలో చేర్చుకోవద్దు..అని ఆదేశించారనే వార్తలు వచ్చాయి కదా..! అది నిజమని తరువాత జరిగిన పరిణామాలు ప్రజలకు చాటి చెప్పాయి. 'కన్నా'ను చేర్చుకోవద్దన్న 'అమిత్‌' మాటలను జవదాటలేక..'జగన్‌' ఆయన ఆదేశాలను పాటించినా...బిజెపి,జగన్‌ల లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే 'కన్నా' చేరిక ఆగిపోయిందనేది 'జగమెరిగిన సత్యం. 'కన్నా'ను పార్టీలో చేర్చుకోకున్నా... ఆయన పోటీ చేసే 'గుంటూరు-2'లో వైకాపా తరుపున వీక్‌ క్యాండిటేడ్‌ను పెట్టాలనేది వారి మధ్య కుదిరిన ఒప్పందం. అప్పుడు కుదిరిన ఒప్పందాన్ని 'జగన్‌' ఇప్పుడు అక్షరాలా అమలు చేస్తున్నారు. 'లేళ్ల అప్పిరెడ్డి' అయితే..గట్టి పోటీ ఇస్తారని..అదే ఎవరికీ తెలియని 'ఏసురత్నమైతే' సోదిలో కూడా ఉండరనే లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే అనామకుడిని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు. 'జగన్‌, బిజెపి' పెద్దల వ్యూహాలు, లోపాయికారీ ఒప్పందాలతోనే...'లేళ్ల' నోట్లో మట్టి కొట్టారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇక్కడొక్క చోటే కాదు..? బిజెపి అడిగిన చోటల్లా...'జగన్‌' ఇటువంటి అనామకులనే అభ్యర్థులుగా ప్రకటిస్తారు. కేవలం బిజెపినే కాదు..'పవన్‌' గట్టిగా ఉన్న చోట్ల కూడా ఇదే రకమైన లోపాయికారీ ఒప్పందాలు జరగబోతున్నాయి. పైకి తాము వేర్వేరు అని చెప్పుకున్నా..ఎన్నికల తరువాత...'జగన్‌, పవన్‌,బిజెపిలు కలవడం ఖాయం. దానికి నిదర్శనమే 'గుంటూరు-2' వైకాపా అభ్యర్థి ఎంపిక. ఇప్పుడు చెప్పండి...'జగన్‌' మొండివాడా..? సొమ్ముల కోసమే అభ్యర్థులను ఎంపిక చేస్తారా..?

(2865)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ