WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు' చెబుతోంది....ఒకటి...పత్రికల్లో వస్తోంది ఒకటి...!?

టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనలతో నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం అవుతోంది. అయితే కొందరు నాయకులు అధినేత చెప్పిన మాటలను, చెప్పలేదని, మంత్రి నారాయణకు పూర్తి అధికారాలు ఇచ్చారని మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్రలపై త్వరలో ఫిర్యాదు చేయబోతున్నారట. మంత్రి సోమిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర వల్ల పార్టీ దెబ్బతిన్నదని తెలుసుకున్న చంద్రబాబు, మంత్రి నారాయణను, ఆదాలను రంగంలోకి దింపి జరిగిన తప్పులను సరిదిద్దుతున్న నేపథ్యంలో వారిద్దరి వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అధినేత చంద్రబాబు చెప్పిదేమిటి..? వారిద్దరూ చేస్తున్నదేమిటి..? దీనిపై తాడోపేడో తేల్చుకోవాలని మెజార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు. నెల్లూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని, అది సాధ్యపడే విధంగా వ్యూహ రచన చేయాలని, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాలను వదలి మిగితా నియోజకవర్గాలపై దృష్టిసారించాలని మంత్రి నారాయణ, ఆదాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. మంత్రి నారాయణ, ఆదాల సమన్వయంతో వ్యవహరిస్తూ..ఎవరెవరిని అభ్యర్థులుగా దింపితే వైకాపాను సమర్థవంతంగా ఎదుర్కోగలరో..వివరాలను సేకరిస్తూ..వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే జీరోగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గాన్ని గెలిచే స్థాయికి పెంచడంలో మంత్రి నారాయణ, ఆదాల సఫలీకృతులయ్యారు. మాజీ ఎమ్మెల్యే బల్లినేని కృష్ణయ్యను పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, జడ్పీ ఛైర్మన్‌ బమ్మిరెడ్డి టిడిపిలో చేరనుండడంతో రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలం ఊహించని స్థాయికి ఎదిగిపోయింది. అప్పగించిన బాధ్యతలనే నిర్వహించాలని, అందుకు మించి అదనంగా స్పందించవద్దని జిల్లా అధ్యక్షుడ్ని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు..మీరు ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఇచ్చాను..సర్వేపల్లి నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల్లో మీరు చేయి పెట్టవద్దని మంత్రి సోమిరెడ్డిని చంద్రబాబు హెచ్చరించినట్లు బయటకు పొక్కింది. నెల్లూరులోక్‌సభ పరిధిలోని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. విచిత్రమేమిటంటే...ఇక్కడ మేయర్‌ అజీజ్‌ను రంగంలోకి దించితే పరిస్థితి బాగుంటుందని కొన్ని పత్రికల్లో రాతలు రాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆత్మకూరులో కన్నబాబుకు ఏదో పట్టుంది..ఆయనకు అన్యాయం జరిగిందని...ఒక పత్రికలో మంత్రి సోమిరెడ్డి, రవిచంద్రలు రాయించారనే విమర్శలు వస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో వైకాపా స్వీప్‌ చేస్తుందని ఆ పార్టీ నాయకులతో పాటు రాజకీయపరిశీలకులు కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో కనీసం సగం సీట్లు అయినా గెలిచి పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కానీ వైకాపాలో జరుగుతున్న పరిణామాలు, మాజీమంత్రి ఆనం ఆ పార్టీలో చేరడంతో వచ్చిన లాభంమేమిటో తెలియదు కానీ..అప్పటి వరకు పార్టీలో ఉన్న నాయకులు ఇది మింగుడుపడలేదు. జడ్పీ ఛైర్మన్‌ బమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి టిడిపిలో చేరేందుకుసిద్ధంగా ఉన్నారని కానీ ఆయనకు ఖచ్చితమైన హామీ ఇస్తేనే సాధ్యపడుతుందని చంద్రబాబు దృష్టికి పలువురు నాయకులు తీసుకెళ్లారు. జడ్పీ ఛైర్మన్‌ పదవి నిర్వహిస్తున్న 'బమ్మిరెడ్డి'కి ఎమ్మెల్సీ కానీ..రాజ్యసభ సభ్యత్వం కానీ కోరితే పరిస్థితి ఏమిటి..? సోమిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయం...ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఖాయం. అప్పుడు ఆపదవి 'బమ్మిరెడ్డి'కి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈ హామీకి 'బమ్మిరెడ్డి' లంగుతారా..? అనేది సందేహాస్పదమే. ఏది ఏమైనా నెల్లూరులో మెజార్టీ నియోజకవర్గాలు టిడిపి గెలుచుకుంటుందని మంత్రి నారాయణ, ఆదాల నమ్మకంతో ఉన్నా..ముగ్గురు ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, మంత్రి సోమిరెడ్డి, రవిచంద్ర వైఖరితో నష్టపోయే అవకాశం ఉందని పలువురు నాయకులు చెబుతున్నారు. 

  త్వరలో అధినేత చంద్రబాబు పలువురు నాయకులతో చర్చించనున్నారని..మీరు వాస్తవాలు చెప్పండి..తన వద్ద నివేదికలకు..నాయకులు చెప్పే మాటలు సరిసమానంగా ఉండాలని చంద్రబాబు చెప్పారట. పత్రికల్లో వస్తోన్న కథనాలను పట్టించుకోవద్దు..ఆ కథనాల్లో వాస్తవాలు ఉన్నా..లేకున్నా..నిజ నిజాలు నాకు తెలుసు..వారసులను ఎన్నికల బరిలోకి దింపాలని ఆశపడవద్దు..సీనియర్లకు న్యాయం చేస్తాను..ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే..తాను చూసుకుంటానని..మీరు వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దు..త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి..ఎవరెవరు ఏయే నియోజకవర్గంలో పోటీ చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకోవద్దు..గీత దాటిన వారిపై వేటు వేస్తానని 'చంద్రబాబు' కొందరి నాయకులను హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో 11 నియోజకవర్గాలను కైవసం చేసుకుంటాం..తాను వారానికి ఐదురోజులు నెల్లూరులోనే ఉంటాను..పదకొండు నియోజకవర్గాల ద్వితీయ శ్రేణి నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎదురవుతున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే..వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని మంత్రి నారాయణ చెబుతున్నారు. నిన్నా మొన్నటి వరకు మౌనంగా ఉన్న మంత్రి నారాయణ ఒక్కసారి విజృంభిస్తుండడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. మంత్రి నారాయణను రంగంలోకి దింపి, ఎంపీ అభ్యర్థి ఆదాలకు అభ్యర్థుల ఎంపికలో స్వేచ్చను చంద్రబాబు ఇచ్చారు. మంత్రి నారాయణ స్పీడు పెంచడంతో మరో మంత్రి సోమిరెడ్డి ఈ మధ్య కాలంలో నోరు మెదపడం లేదు..పెదవి విప్పడం లేదు..మీడియా వర్గాలకు దూరంగా ఉంటున్నారు.. పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర కూడా అధినేత హెచ్చరికతో..అందరితో కలసిమెలసి పనిచేస్తూ..వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. ఈపరిణామాలు పార్టీకి అదనపు బలం చేకూరడంతో..వైకాపా నాయకులు ఖంగుతింటున్నారు.

(279)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ