WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'స్థానిక' అవినీతిని కట్టడి చేస్తే...'ఉమ'దే విజయం...!

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన 'దేవినేని ఉమామహేశ్వరరావు' ఆ నియోజకవర్గం రిజర్వడ్‌ కావడంతో మైలవరం నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు పోటీ చేసి విజయంసాధించిన విషయం విదితమే. స్థానికంగా మంత్రిఉమపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ..గ్రామస్థాయి నాయకుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వైకాపా నాయకులతో కుమ్మక్కు అయి కాంట్రాక్టులను పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా..మంత్రి ఉమ మంచివాడని..నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటున్నారని, కానీ ఇచ్చిన హామీలను నిలుపుకోవడంలో పక్కువగా శ్రద్ద తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయి నాయకుల అవినీతి మంత్రికి చెడ్డపేరు తెస్తుందని పలువురు చెప్పడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో రెండుసార్లు విజయం సాధించిన మంత్రి ఉమ మూడవసారి గెలవడం ఖాయం..కానీ..సులువుగా విజయం సాధించే పరిస్థితి ఉండడంతో స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేకత వల్ల మంత్రి ఉమపై పడుతుందని, ఆ వ్యతిరేకతను తగ్గించి...స్థానికులను అదుపులోకి తేగలిగే ఆయన గెలుపుకు ఢోకా ఉండదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇదే విషయంపై మంత్రి సన్నిహితులను ప్రశ్నించగా..ఇందులో వాస్తవం ఉంది..స్థానిక నాయకుల అవినీతి శృతి మించి రాగానపడింది..మంత్రి ఉమ మెతకవైఖరి అవలంభించడంతోనే వారికి కొమ్ములు వచ్చాయి..కానీ మంత్రి ఇటీవల కాలంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు..ఇప్పుడిప్పుడు వ్యతిరేకత ఉన్న గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది..ఎన్నికల నాటికి వారిలో వ్యతిరేకత తక్కుతుందని వారు చెబుతున్నారు. మంత్రి ఉమ అవినీతిపరుడు కాకపోయినా..మాయమాటలతో మభ్యపెడతారనే విమర్శలు ఉన్నాయి. అటువంటిదేమీ లేదు..ఆయన ఒక్కోసారి మరిచిపోతుంటారు..ఈసారి ఆయన ప్రతి విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసుకుంటున్నారు.ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని చెబుతున్నారు సన్నిహితులు. నియోజకవర్గంలో దేవినేని ఉమాను ఓడించడం అంత సులువు కాదని 'జగన్‌'కు కూడా తెలుసు. 

  కోట్లు గుమ్మరించినా..భయపెట్టినా...మెజార్టీ ఓటర్లు టిడిపి వైపే మొగ్గుచూపుతున్నారని వారికి తెలిసింది. స్థానికంగా ఎవరైనా దౌర్జన్యం చేస్తే..వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా మంత్రి ఉమ తయారు అవుతున్నారు. కత్తికి..కత్తికి..మంచికి మంచిగా ఉండాలని..ఈ విషయంలో మంత్రి మెతక వైఖరిని విడనాడాలని ప్రత్యర్థులను ఓటర్లే తరిమికొట్టే విధంగా ముందుకడుగు వేయాలని...స్థానిక నేతలు కోరుతున్నారు. ఇదే విషయంపై మంత్రిని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రాజకీయ జీవితంలో దౌర్జన్యాలను చేయలేదు..ప్రోత్సహించలేదు..నందిగామలో ప్రారంభమైన మా రాజకీయ జీవితం..ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది తప్ప..హత్యా రాజకీయాలను దౌర్జన్యాలను ప్రోత్సహించినట్లు ప్రత్యర్థులు కూడా ఆరోపించలేదని, హామీ ఇస్తే..అమలు అయ్యే వరకు నిద్రపోలేదని..చెప్పే మాటలకు కట్టుబడతానంటున్నారు. ఏది ఏమైనా..మైలవరం నియోజకవర్గాన్ని రెండేళ్లు పట్టించుకోకపోయిన మంత్రి తరువాత దృష్టి పెట్టారు. స్థానిక నేతల అవినీతిని కట్టడి చేయకపోవడమే ఆయనకు అవరోధంగా మారే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆయనకు సన్నిహితుడైన ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించగా...ఇంతకు ముందు జరిగిన పొరపాట్లను, తప్పిదాలను మంత్రి సరిచేస్తున్నారని ఆయనను 'జగన్‌' తండ్రి వై.ఎస్సే ఓడించలేకపోయారు..వసంత, జగన్‌,పవన్‌,బిజెపి నాయకులందరూ కలిసినా చంద్రబాబును ఏ విధంగా ఓడించలేరో..ఉమను కూడా అదే విధంగా ఓడించలేరని, ఆయనకు వచ్చిన మెజార్టీ రాకపోవచ్చు...కానీ ఓడిపోయే ప్రసక్తేలేదు..మెజార్టీ ఎంత అనే విషయంపై చర్చ జరుగుతుంది తప్ప..గెలుపుపై చర్చ జరగడం లేదని చెప్పారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తిరిగాను..స్థానిక నాయకుల్లో వ్యతిరేకత ఉన్నా..ఓటు విషయంలో మాత్రం ఉమకు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పటికైనా మంత్రి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించి హ్యాట్రిక్‌ సాధించి సంచలనం సృష్టించబోతున్నారని ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్న ఉద్యోగులు చెబుతున్నారు.

(217)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ