WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దేశం'లో 'దేవినేని రమణ,దూళ్లిపాళ్ల' వంటి నేతలు ఏరి...!?

రాజకీయంగా బాగా ఎదుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురై మరణించిన మాజీమంత్రులు దేవినేని రమణ, దూళ్లపాళ్ల వీరయ్యచౌదరి వంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఎంత వెతికినా కనిపించడం లేదనేది వాస్తవం. మాట తప్పరు..ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఎంతవరకైనా..వెళ్లే వారి బాటలో..వారి వారసులుగా ఎమ్మెల్యేలు అయిన మంత్రి దేవినేని ఉమ, దూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌లు వెళ్లడం లేదనే మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఎలా ఉండాలో చేతలతో చూపించారు మాజీమంత్రి 'వీరయ్యచౌదరి'. నియోజకవర్గంలో అభివృద్ధిని ఎలా చేయాలో చూపించారు దివంగత మంత్రి దేవినేని రమణ. నందిగామ నియోజకవర్గం అభివృద్ధిబాటలో దూసుకెళ్లిందంటే అందుకు 'దేవినేని రమణ' ముఖ్య కారణం. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న 'కుప్పం'లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో..అదే విధంగా నందిగామ నియోజకవర్గంలో 'దేవినేని రమణ' అమలు చేశారు. కుప్పం నియోజకవర్గానికి ధీటుగా 'నందిగామ' నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది 'రమణ' పట్టుదల. అవినీతి ముద్రపడకుండా..ఎలాంటి బలహీనతలు లేకుండా అందరికి అందుబాటులో ఉండి...కుల,మతాలకు అతీతంగా ఓటర్ల మద్దతు పొందారు వీళ్లిద్దరు. ఒకప్పుడు 'రమణ' నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు అదుగో రౌడీ వచ్చారు..గెలిపిస్తే జాగ్త్రత...అంటూ ప్రత్యర్థులు ప్రచారం చేసినా ఓటర్లు పట్టించుకోలేదు..రమణను గెలిపించారు.. నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్య కారకులయ్యారు. మంత్రి హోదాలో రైలులో ప్రయాణీస్తూ ప్రమాదానికి గురై రమణ మరణించగా..అదే విధంగా రోడ్డు ప్రమాదంలో 'వీరయ్యచౌదరి' మృతి చెందారు. వీరిద్దరి మృతి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి నిరోధమైంది. అన్న రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చిన 'ఉమ' రమణ లాగా పేరు తెచ్చుకోలేకపోయారు..ఆయన బాటలో నడవలేకపోతున్నారు. రమణ నోటి నుంచి మాట వస్తే...అధికారులు కూడా అభిమానంతో పనులు చక్కపెట్టేవారు. మాట తప్పని నాయకుడు, మడమ తప్పని ఎమ్మెల్యేగా రమణ, వీరయ్యచౌదరిలు పేరు తెచ్చుకున్నారు. ఎవరైనా ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కు అయ్యారని తెలిస్తే..వారు వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. అటు నందిగామ,ఇటు మైలవరంలో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినా..పొన్నూరు నియోజకవర్గంలో 'దూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌' వేసిన తప్పటడుగుల వల్ల గ్రామ స్థాయి నాయకులు, వైకాపా నాయకులు పరస్పరం సహకరించుకుని కాంట్రాక్టలను పంచుకున్నారనే విమర్శ ఉంది. 

  తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి అప్పట్లో ఆ రెండు నియోజకవర్గాల్లో ఉండేది. ఎవరైనా పార్టీ కార్యకర్తలు, అభిమానులపై దౌర్జన్యం చేస్తే..రమణ, వీరయ్యచౌదరిలు సీరియస్‌గా స్పందించి దాడులు చేసిన వారికి బుద్ది చెప్పి మళ్లీ దాడులు జరగకుండా జాగ్రత్తపడేవారు. ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో దూళ్లిపాళ్ల వ్యవహారించిన తీరు కుమారుడైన 'నరేంద్ర'కు రాలేదు. అయిదుసార్లు నియోజకవర్గంలో విజయంసాధించినా.కేవలం రెండుసార్లు విజయం సాధించిన దూళ్లిపాళ్ల వీరయ్యచౌదరికి వచ్చిన పేరు ప్రతిష్టలు నరేంద్రకు రాలేదంటే పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది. గతంలో ప్రత్యర్థుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వీరయ్యచౌదరి వెళ్లేవారు కాదు..అదే విధంగా పార్టీ నాయకులు కూడా మొక్కుబడిగా వెళ్లి వచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైంది. దీనిని సరిదిద్దండంలో 'నరేంద్ర'పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. దేవినేని వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న 'ఉమ' మొదటల్లో కొన్ని తప్పటడుగులు వేసినా..తరువాత సరిచేసుకుని ముందు కెళుతు న్నారు..అందుకేనేమో..మంత్రి ఉమ అంటే చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం. గతంలో రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వీరయ్య చౌదరిని ఓటర్లు ఎన్నికల్లో ఓడించినా ఆయన నిరాశ పడలేదు. అప్పట్లో సంఘం డైరీ ఛైర్మన్‌గా మీరే ఉండాలంటూ దివంగత ఎన్టీఆర్‌పట్టుపట్టినటప్పుడు..సార్‌ నేను ఎమ్మెల్యేను, మంత్రి అయ్యాను..మరొకరికి అవకాశం ఇవ్వండి..అని చెప్పినా..ఎన్టీఆర్‌ ఆయననే ఛైర్మన్‌గా ఉండాలని కోరారు. కానీ..ఇప్పుడు ఆయన కుమారుడు ఎమ్మెల్యే పదవితో పాటు సంఘం డైరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు..అదనంగా మంత్రి పదవి కూడా కోరుకుంటున్నారు. ఆ పదవి దక్కకపోవడంతో కొన్ని రోజులు అలకపాన్పు కూడా ఎక్కారు. ఎలాంటి తండ్రి, ఎలాంటి కొడుకు అని నియోజకవర్గంలో సీనియర్‌ సిటిజన్లు చెబుతుంటే ఆవేదన కలుగుతుంది. ఇప్పటికైనా నరేంద్ర పద్దతి మార్చుకోకుంటే ముందు ముందు తిప్పలు తప్పవని చెబుతున్నారు. గత 20సంవత్సరాల్లో ఇటువంటి నాయకులు టిడిపిలో కనిపించ లేదంటే...రోజులు ఎంత మారిపోయాయో స్పష్టం అవుతోంది.

(314)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ