WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కన్నా' ఎప్పుడూ ద్రోహుల వెంటే ఉంటారా...?

కొంత మంది రాజకీయనాయకుల జీవితం మొత్తం వ్యక్తిగత స్వార్థంతోనే గడిచిపోతుంటోంది. ఎన్నికలకు ముందు మాత్రం తాము ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని, వారి శ్రేయస్సే తమ ధ్యేయమని, పేదవారిని, నిర్భాగ్యులను ఆదుకుని ప్రజాసేవ చేస్తామని నమ్మబలుకుతారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఎడాపెడా సంపాదించి మరో మూడు తరాలకు సరిపడా ఆస్తులు పోగేసి పోతారు.ఈ ప్రక్రియలో ప్రజాసంక్షేమం, ప్రజాఅవసరాలు, రాష్ట్ర భవిష్యత్‌ ఇలాంటివేవీ వారికి గుర్తుకు రావు. రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా..వారు.. తమ పదవులు, ఆస్తులను కాపాడుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇలా వ్యవహరించే వారిలో ముందుగా ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 'కన్నా లక్ష్మీనారాయణ' గురించి చెప్పుకోవాలి.

 'వంగవీటి రంగా' అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన 'కన్నా లక్ష్మీనారాయణ' 'రంగా' హత్యానంతరం జరిగిన గొడవల్లో క్రియాశీలకంగా వ్యవహరించి రాజకీయాల్లోకి దూసుకు వచ్చారు. కాంగ్రెస్‌ యువనేతగా..రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనతికాలంలోనే ఎదిగారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, గుంటూరు-2 నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి మొత్తం ఐదుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. పలువురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో కీలకశాఖలకు మంత్రిగా పనిచేసి భారీగా ఆస్తులు సంపాదించుకున్నారని అప్పట్లో కాంగ్రెస్‌లోనే ఉన్న సీనియర్‌ నాయకులు బహిరంగంగానే ఆరోపించారు. అయితే సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా...మంత్రివర్గం నుంచి తొలగించలేదు.దాంతో మనోడు ఎడాపెడా..సంపాదించి..గుంటూరు జిల్లాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే స్వంతగా ఎదగాలని...వై.ఎస్‌ ఛాయల నుంచి బయటకు రావాలని ప్రయత్నించారు. అయితే..హెలికాప్టర్‌ ప్రమాదంలో రాజశేఖర్‌రెడ్డి మృతి చెందడంతో...ఆయనకు అనుకోకుండా అవకాశం దొరికింది. రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన తరువాత..తన కులాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం ఎగబాకాలని ప్రయత్నించినా..అవి ఫలించలేదు. అయితే...ఈ లోపు కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం..అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న 'కిరణ్‌కుమార్‌రెడ్డి' దాన్ని వ్యతిరేకించడంతో..'కన్నా' అధిష్టానం ప్రాపకం పొంది..చివరి ఆరు నెలల్లోనైనా ముఖ్యమంత్రి పదవి పొందాలని  ఆశపడ్డారు. కానీ..ఆయన ఆశలను 'కిరణ్‌' వమ్ముచేస్తూ..ఆఖరి వరకు సిఎం సీటు నుంచి కదలకుండా రాజకీయం నడపారు. 

  ఒకవైపు రాష్ట్రం మొత్తం కాంగ్రెస్‌ చేస్తోన్న విభజనకు నిరసనగా రోడ్లెక్కితే...'కన్నా' మాత్రం కిక్కురమణలేదు. ఆ పార్టీకే చెందిన సీనియర్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు విభజనకు వ్యతిరేకంగా పోరాడినా 'కన్నా' మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. పైగా అధిష్టానానికి సహకరించి విభజనను సులువు చేశారు. విభజన సందర్భంగా 'కన్నా' వ్యహరించిన తీరు చూసిన 'గుంటూరు-2' ఓటర్లు ఆయనకు డిపాజిట్‌ గల్లంతు చేశారు. అయితే ఎన్నికల్లో టిడిపి గెలవడంతో..తన ఆస్తులపై ఎక్కడ విచారణ జరిపిస్తుందన్న భయంతో వెంటనే బిజెపిలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి...బిజెపి పెద్దలు ఆడిస్తున్నట్లు ఆడుతున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను బిజెపి నెరవేర్చకపోయినా..వాటి గురించి అడగకుండా...నిరంతరం రాష్ట్ర ప్రభుత్వంపై ఆడిపోసుకోవడం, విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ..మరో సారి ద్రోహులకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్‌లో ఉండి రాష్ట్రానికి ద్రోహం చేసిన 'కన్నా' విభజనాంతరం హామీలు నెరవేర్చని 'బిజెపి'లో ఉంటూ..మరోసారి ద్రోహానికి పాల్పడుతున్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం 'కన్నా' రాష్ట్రానికి ఎన్నిసార్లైనా ద్రోహం చేస్తారని మరోసారి నిరూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు బిజెపి, వైకాపా కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా...గుంటూరు-2 నుంచి మరోసారి పోటీ చేసి చట్టసభలకు ఎంపిక కావాలని ఆయన జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇన్ని సార్లు  రాష్ట్రానికి ద్రోహం చేసిన 'కన్నా'ను మరోసారి చట్టసభలకు ఆ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటారా..? ఏమో చూడాలి మరి.

(464)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ