WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దెందులూరు'లో హీరో ఎవరు..? విలన్‌ ఎవరు..?

పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ చేసిన విమర్శలు, ఆరోపణలు సంచలనం సృష్టించగా ఆ మరునాడు 'చింతమనేని' విలేకరుల సమావేశంలో వాటిని తిప్పికొడుతూ...తాను తప్పుడివాడినైనా కులతత్వం ఉన్నా..నీకు దమ్ముంటే నాపై గెలువు..నీ సామాజికవర్గ ఓటర్లే నిన్న తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో 'చింతమనేని' ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న విషయం 'పవన్‌'కు తెలియదు. ఇంటికి ఎవరు వచ్చినా..చెయ్యి కడగకుండా వారిని బయటకు వెళ్లనివ్వరు. సమస్యపై వచ్చేవారిని సమస్య పరిష్కారంలో 'చింతమనేని' స్టైలే వేరు. ఆయన వ్యాపార లావాదేవీలు ఏమున్నాయో..తమకు తెలియదని, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో ఆయన ఎప్పుడూ లంచాలు తీసుకోలేదని నియోజకవర్గ అధికారులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. చింతమనేని సామాజికవర్గ అధికారులు అక్కడ తక్కువగా ఉన్నారు..కాపు, బిసి కులాలకు చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. కుల మదంతో 'చింతమనేని' విర్రవీగుతున్నారని.. సోషల్‌మీడియాలో 'పవన్‌' అభిమానులు పోస్టింగ్‌లు పెడుతున్నారు. నియోజకవర్గంలో లక్షా 80వేల ఓట్లు ఉండగా..అందులో కమ్మ సామాజికవర్గ ఓట్లు 30వేలు మాత్రమే. మిగతా లక్షా యాభైవేల ఓట్లు ఇతర కులాల వారివే. 

  కమ్మ సామాజికవర్గ ఓట్లతోనే ఆయన ఎలా గెలుస్తారు..కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్న గ్రామాల్లో కూడా ఓటర్లు 'చింతమనేని'కి బ్రహ్మరథం పడుతున్నారు. సినీహీరోగా 'పవన్‌'ను గౌరవిస్తాం..ప్రేమిస్తాం..ఓటు మాత్రం 'చింతమనేని'కే వేస్తామని కాపు వర్గానికి చెందిన ఓటర్లు చెబుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన యువత మాత్రమే పవన్‌ వైపు ఉంటారని...మిగతా వారు 'చింతమనేని' వైపు నిలుస్తారని వారు చెబుతున్నారు. 'చింతమనేని' ఆకురౌడీ అంటూ 'పవన్‌' వ్యాఖ్యలు చేసినా..'చింతమనేని' వ్యక్తిగత విమర్శలకు దిగకుండా...నేను రౌడీనీ అయితే..రౌడీలా అసెంబ్లీకి వస్తానని..దమ్ముంటే తనపై గెలవాలని 'పవన్‌'కు సవాల్‌ విసిరారు. 'చింతమనేని'కి ఆయన సామాజికవర్గాల మద్దతు ఉందో లేదో కానీ మెజార్టీ ఓటర్లు మాత్రం ఆయన వైపే మొగ్గుచూపుతున్నారు. ఆయన ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు..? పనిచేస్తారు..అధికారులతో ఆగమేఘాలపై పనులు చేయిస్తారు. ఇంటికి ఏ కులం వారు వచ్చినా...వారిని గౌరవంగాపలకరిస్తారు..కాఫీ,టీలు ఇస్తారు..ఆయనకు కోపం వస్తే..దూకుడుగా మాట్లాడతారు తప్ప..ఆయన కడుపులో ఏమీ ఉంచుకోరని వారు చెబుతుంటారు. ఇదే విషయంపై మీడియా వర్గాలు జిల్లా అధికార వర్గాలతో సంప్రదించగా..ఆయన అప్పుడప్పుడు తమతో మాట్లాడతారని...పనుల విషయంపై చర్చిస్తారని...దూకుడగా వ్యవహరించారని చెప్పారు. ఇదే విషయాన్ని ఆఖరులో తెలుసుకున్న 'పవన్‌' చింతమనేనిపై వ్యాఖ్యలను తగ్గించి చల్లబడ్డారు.

(252)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ