WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రజనీ'కి 'మర్రి' మద్దతు లేకుంటే మంత్రి 'పుల్లన్న' విజయం ఖాయం...!

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో టిడిపికి బ్రహ్మరథంపట్టిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మంత్రి పుల్లారావు వ్యవహారశైలిని తప్పుపడుతూ..ఆయన కుటుంబ జోక్యంపై నిరసన వ్యక్తం చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అనుకూలంగా మలచుకుని..ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ నానా తంటాలు పడ్డారు. పుల్లారావు మళ్లీ ఎన్నికల్లో గెలుస్తారా..? గెలవరా..? ఒకవేళ ఆయన గెలిచినా బటా బటి మెజార్టీతో బయటపడతారు తప్ప..ఇదివరకటి మెజార్టీ రాదని స్థానిక నేతలు అనేక సందర్బాల్లో చెప్పారు. ఇంతలో వ్యవస్థను తారుమారు చేశారు వైకాపా అధినేత 'జగన్‌'. ఒకప్పుడు టిడిపిలో హడావుడి చేసి సంచలనం సృష్టించిన 'రజని'ని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆమెనునియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించడంతో పార్టీలో ముసలం ఏర్పడింది. వందల కోట్లు సంపాదించి వివిధ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న మంత్రి పుల్లారావు వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్న స్థానికులు కోటి రూపాయలు కూడా ఖర్చు చేయలేని మర్రిపై జాలి చూపుతున్నారు. ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా...'రజని' విజయం సాధించలేరు. కానీ..'మర్రి' ఆమెకు పరిపూర్ణమైన మద్దతు ఇచ్చి..ఆమెతో కలసి ప్రచారం చేస్తే..మంత్రి పుల్లారావుకు చెమటలు పట్టడం ఖాయం అంటున్నారు స్థానిక నేతలు. రజనీ గెలిపించాలన్నా..ఓడించాలన్నా 'మర్రి' వ్యవహారశైలిని బట్టే ఉంటుంది. 

  ఇంత వరకు 'రాజశేఖర్‌' తన అంతరంగాన్ని బయట పెట్టలేదు. సమన్వయకర్తగా 'రజనీ'ని నియమించారు..ముందు ముందు ఏం జరుగుతుందో..చూడండి..మొదటి నుంచి రాజకీయ సిద్ధాంతాలను నమ్ముకుని కాలం వెలబుచ్చుతున్నాను..ఇదే పుల్లారావుపై చిలలూరిపేట ప్రజలు ఇండిపెండెంట్‌గా గెలిపించారు. అప్పట్లో తాను గెలుస్తానంటే ఏ ఒక్కరూ నమ్మలేదు..అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థికి పదివేల ఓట్లు మాత్రమే వచ్చాయని..ఇప్పుడు తాను మరో నిర్ణయం తీసుకుంటే 2004 ఫలితాలు వస్తాయని అంటున్నారు. నిజాయితీపరుడు అయిన 'మర్రి' ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే...వేరే ఫలితాలు వస్తాయని టిడిపి అభిమానులు కూడా చెబుతున్నారు. కోట్లాది రూపాయలు సొమ్ము లేనంత మాత్రాన ఎన్నికల్లో విజయం సాధించలేరా..? ఎందుకు వై.ఎస్‌జగన్‌ రజనీని అభ్యర్థిగా నిర్ణయించారని ఆ పార్టీకి చెందిన ఓటర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రజనీకి పూర్తి సహకారం ఇచ్చి 'మర్రి' పనిచేస్తే..మంత్రి పుల్లారావుకు ఓటమి తప్పదు. ఒకవేళ రాజశేఖర్‌ మనస్ఫూర్తిగా పనిచేయాలని భావించానా..ఆయనను అభిమానించే ఓటర్లు ఎంత వరకు రజనీ కోసం పనిచేస్తారో తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో 'మర్రి'ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. జగన్‌కు ఇవే ఆఖరి ఎన్నికలని..ఆఖరి నిమిషంలో గెలిచే అభ్యర్థికి ఆయన టిక్కెట్‌ ఇస్తారని 'జగన్‌' సామాజికవర్గ ఓటర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా చిలకలూరిపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు. మంత్రి పుల్లారావు, ఆయన కుటుంబ సభ్యులపై అసంతృప్తిగా ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు తాజాగా వైకాపాలో జరుగుతున్న పరిణామాలను చూసి వారు మౌనం వహిస్తున్నారు. ఏది ఏమైనా 'మర్రి' తీసుకునే నిర్ణయంపై 'రజనీ' గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఈ పరిణామాలు 'పుల్లారావు'కు ఏ విధంగా కీడు చేస్తాయో వేచి చూడాల్సిందే.

(303)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ